Indus appstore: యాప్ స్టోర్ విషయంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో స్వయం సమృద్ధిగా ఎదగాలని చూస్తున్న భారత్.. లోకల్ మేడ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.
మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా అండ్రాయిడ్ ఆధారిత యాప్ స్టోర్ ను కేంద్ర IT మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్లు ఫిన్ టెక్ లీడర్ ఫోన్ పే తెలిపింది. ఇండస్ యాప్‌స్టోర్ గా నామకరణం చేయగా.. దీన్ని ఫిబ్రవరి 21న స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. 'ఆత్మనిర్భర్ భారత్' ఇనీషియేటివ్‌తో అద్భుతమైన యాప్ స్టోర్ ద్వారా స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది.

'గ్లోబల్ ప్లేయర్స్ సాంకేతిక, వాణిజ్యం మరియు పంపిణీ గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి ఈ యాప్ స్టోర్ ఓ సాధనంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్‌ప్లేస్‌ను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, మైల్‌స్టోన్ లాంచ్‌లో భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్ ను గ్లోబల్ ఫస్ట్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రత్యేక 24×7 కస్టమర్ మద్దతుతో పాటు డెవలపర్లు వారి యాప్‌లను పర్యవేక్షించడానికి, అభివృద్ధి చేయడానికి బహుళ సాధనాలను అందిస్తుంది' అని ఫోన్ పే ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండస్ యాప్‌స్టోర్ లాంచ్ ఈవెంట్.. యాప్ మార్కెట్‌ప్లేస్ ద్వారా సాధికారత పొందిన స్టార్టప్ మరియు డెవలపర్ కమ్యూనిటీల నుండి 300 మందికి పైగా సభ్యులను హోస్ట్ చేస్తుంది. వీరిలో ఇండియాకి చెందిన పాత్ బ్రేకింగ్ మరియు ఇన్నోవేటివ్ కంపెనీల CEOలు మరియు వ్యవస్థాపకులు ఉన్నారు.
ఇండస్ యాప్‌స్టోర్ అనేది స్థానిక ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ స్టోర్. ఇది భారతీయ వినియోగదారులకు స్థానికీకరించిన మరియు సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఇంగ్లీష్ సహా 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ ప్రాధాన్య భాషలో యాప్ స్టోర్‌ను అన్వేషించడానికి అనుమతిస్తుంది.


Click it and Unblock the Notifications