Multibagger Stock: రెండేళ్లలో రూ. లక్షను.. 4.90 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఇప్పటికీ ఆల్ టైమ్ హై లో
Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్ దొరకటం ఇన్వెస్టర్లకు వరంగా చెప్పుకోవాలి. వేల సంఖ్యలో ఉండే లిస్టెడ్ షేర్లలో మంచి పనితీరు, ఎదుగుదల ఉండే కొన్ని మాత్రమే మల్టీ బ్యాగర్లుగా నిలుస్తుంటాయి. ఈ కోవకు చెందినదే.. మైక్రోక్యాప్ కంపెనీ ఇంద్రాయని బయోటెక్ లిమిటెడ్(Indrayani Biotech Limited) స్టాక్. గత కొన్ని సంవత్సరాలుగా తన ఇన్వెస్టర్లకు ఈ షేర్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది.

ఐదు రెట్లు పెరిగిన పెట్టుబడి విలువ:
ఈ షేర్ లో ఏడాది క్రితం లక్ష రూపాయులు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు దాని విలువ రూ.3.6 లక్షలు అయ్యేది. అదేవిధంగా.. రెండేళ్ల క్రితం లక్ష రూపాయలు విలువైన షేర్లు కొన్నట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ.4.9 లక్షలకు చేరి ఉండేది. కంపెనీ బయోటెక్, ఫుడ్ & హాస్పిటాలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆగ్రో, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో వ్యాపారాలు కలిగి ఉంది. కంపెనీ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన, వినూత్న వ్యాపార నమూనాలను అభివృద్ధి చేస్తూ.. వాటిని అవలంబిస్తోంది.

నష్టాల నుంచి లాభాలకు:
గత వారం.. కంపెనీ మార్చి 31, 2022తో ముగిసిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. గడచిన నాలుగు త్రైమాసికాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికర ఆదాయం 140 శాతం వృద్ధి చెందింది. FY22 నాలుగో క్వార్టర్ లో ఆదాయం రూ.17.24 కోట్లకు చేరుకుంది. అదే విధంగా కంపెనీ నికర లాభం (PAT) రూ.1.6 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3.24 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

కరోనా తరువాత ట్రాక్ లోకి:
కరోనా మహమ్మారి కారణంగా IBL తీవ్రంగా ప్రభావితమైంది. కరోనాకు సంబంధించిన ఆంక్షలు తొలగించిన తర్వాత.. కంపెనీ వ్యాపారం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. గత ఎనిమిది త్రైమాసికాల పరిస్థితిని పరిశీలిస్తే.. కంపెనీ విక్రయాలు 400 శాతానికి పైగా పెరిగాయి. జూన్ 2020 త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 5.3 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా.. మార్చి 2022 త్రైమాసికంలో రూ. 1.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

షేర్ విలువ ఎలా ఉందంటే..
జూన్ 8, 2022న కంపెనీ షేరు BSEలో రూ. 41.20కి చేరుకుంది. ఇది 52 వారాల గరిష్ఠమని చెప్పుకోవాలి. అలాగే ఇది ఆల్ టైమ్ హై లెవెల్. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.8.42గా ఉంది. జూన్ 2, 2022న, దాని పూర్తి యాజమాన్యంలోని రెండు అనుబంధ సంస్థలైన IBL హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, HSL అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్‌గా మార్చబడ్డాయి. దీని వాటి పేరు IBL హెల్త్‌కేర్ లిమిటెడ్, HSL అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్‌గా మారాయి.


Click it and Unblock the Notifications