Stock Fall: దేశీయంగా స్టాక్ మార్కెట్లు మామూలుగానే భారీ ఒడిదొడుకులతో పాటు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన కంపెనీల షేర్లు క్రాష్ కావటంతో నేడు మార్కెట్లో కీలక బెంచ్ మార్క్ సూచీలు నష్టాలను చవిచూశాయి. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో రెండు కంపెనీల షేర్లు భారీ క్షీణతను చూశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెండు దేశీయ గ్యాక్ కంపెనీల షేర్ల గురించే. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్స్ భారీగా నష్టాలను నమోదు చేశాయి. ఈ కంపెనీల దాదాపు షేర్లు 20 శాతం వరకు క్షీణించను చూశాయి. అయితే ఒకే రంగంలో వ్యాపారం చేస్తున్న ఈ రెండు కంపెనీల షేర్లు పతనం కావటానికి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయమే కారణంగా తెలుస్తోంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం గ్యాస్ కేటాయింపుల్లో మళ్లీ ప్రాధాన్యత ప్రాతిపదికన కోతలు పెట్టడమే ఈ నష్టాలకు కారణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సదరు కంపెనీల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన బ్రోకరేజీ సంస్థలు ఈ కంపెనీలకు రేటింగ్ తగ్గించాయి.

ముందుగా ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో నేడు 20 శాతం క్షీణతను చూశాయి. దీంతో ఎన్ఎస్ఈలో మధ్యాహ్నం 3.25 గంటల సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.325.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.22,790 కోట్లకు తగ్గింది. స్టాక్ నేడు ఇంట్రాడేలో తన 52 వారాల కనిష్ఠ ధర రూ.323.10ని తాకింది. ఇదే క్రమంలో మరో స్టాక్ మహానగర్ లిమిటెడ్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో భారీగా పతనమై రూ.1075.25 స్థాయికి చేరుకున్నాయి. అయితే నష్టాలనుంచి కొంత తేరుకుని మధ్యాహ్నం 3.28 గంటల సమయంలో 14 శాతం నష్టంతో రూ.1133.15 రేటు వద్ద తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. కంపెనీ షేర్లు కూడా నేడు ఇంట్రాడేలో తన 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. దీనికి తోడు మార్కెట్లోని మరికొన్ని సంస్థల షేర్లు సైతం ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
వరసగా రెండో నెలలో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్ కంపెనీల గ్యాస్ కేటాయింపులను తగ్గించటంతో అది కంపెనీల ఆర్థికంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న కోత నిర్ణయంతో కంపెనీలు ఇప్పుడు ఖరీదైన దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడాల్సి వస్తుందని వెల్లడైంది. అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం ఇప్పుడు 40-45 శాతానికి పెరిగింది. గతంలో ఇది 65-70 శాతం మధ్య ఉండేది. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ మహానగర్ గ్యాస్ షేర్లపై గతంలో అందించిన 'BUY' రేటింగ్ ను ప్రస్తుతం 'అండర్ పెర్ఫార్మ్'కి తగ్గించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.1130ని టార్గెట్ ధరగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో మరో కంపెనీ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌కు 'హోల్డ్' రేటింగ్ ఇవ్వటంతో టార్గెట్ ధరను రూ.295కి తగ్గించింది. గతంలో దీనికి టార్గెట్ ధరను రూ.330గా బ్రోకరేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications