Indo Farm Equipment IPO: కొత్త వారంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను కొనసాగిస్తున్నాయి. నిన్నటి నష్టాల నుంచి తేరుకున్న ఈక్విటీ మార్కెట్లలో నేడు ఐపీవోల మ్యాజిక్ మెుదలైంది. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు భారీగా రాబడులను చూస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో షేర్లు నేడు ఎన్ఎస్ఈలో 9.58 శాతం ప్రీమియం ధర రూ.280.52 వద్ద జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో 9.46 శాతం ప్రీమియం రేటు రూ.282.85 వద్ద అడుగుపెట్టాయి. ఈ క్రమంలోనే కంపెనీ షేర్లకు లిస్టింగ్ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీగా డిమాండ్ వల్ల దాదాపు 11 శాతం లిస్టింగ్ లాభాలను చూసింది.

వాస్తవానికి తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ రూ.260.15 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.184.90 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. మిగిలిన భాగానికి కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 0.35 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచింది. ఈ క్రమంలో కంపెనీ ఇష్యూను డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచింది. అయితే నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఏకకాలంలో జాబితా చేయబడ్డాయి. దీనికోసం కంపెనీ తన ఆఫర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.204 నుంచి రూ.215గా ఉంచిన సంగతి తెలిసిందే.
కంపెనీ తన ఆఫర్ లాట్ పరిమాణాన్ని 69 షేర్లుగా ఉంచటంతో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనటానికి కనీసం రూ.14,835 వెచ్చించాల్సి వచ్చింది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా ఉన్న రణబీర్ సింగ్ ఖడ్వాలియా, సునీతా సైనీ ఐపీవోకు ముందు కంపెనీలో 93.45 శాతం వాటాను కలిగి ఉండగా ప్రస్తుతం అది 69.44 శాతానికి తగ్గింది. ఇదే క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.78.05 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి కంపెనీ 1994లో స్థాపించబడింది. కంపెనీ ట్రాక్టర్లు, పికప్ అండ్ క్యారీ క్రేన్లు, హెవీ హార్సి పవర్ కలిగి ట్రాక్టర్లు, పికప్ క్రేన్ల తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీకి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సొంతంగా ఫౌండ్రీ కూడా ఉంది. అయితే ప్రస్తుత ఐపీవో నుంచి సమీకరించే మెుత్తాన్ని కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించటానికి ఉపయోగించాలని నిర్ణయించింది. అలాగే సబ్సిడరీ ఎన్బీఎఫ్సీ బరోటా ఫైనాన్స్ లిమిటెడ్ లో పెట్టుబడి కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications