Indo Borax and Chemicals: భారీ డివిడెండ్ ప్రకటించిన కెమికల్ స్టాక్.. ఇన్వెస్టర్లకు పండగే..!

స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ఇండో బోరాక్స్ & కెమికల్స్ భారీ డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారు. కంపెనీ షేర్లను కొనుగోలు చేయడంతో.. శుక్రవారం ఇండో బోరాక్స్ & కెమికల్స్ షేరు ధర 3.58 శాతం పెరిగి రూ. 463.50కి చేరింది. ఇండో బోరాక్స్ & కెమికల్స్ ఒక్కో ఈక్విటీ షేరుకు మొత్తం రూ. 40 డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. ఇందులో ఒక్కో షేరుకు రూ. 10 తుది డివిడెండ్, రూ. 30 ప్రత్యేక డివిడెండ్ ను ప్రకటించింది. ఈ డివిడెండ్ 2026 జూలై 28నన జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండనుంది.

ఈ డివిడెండ్‌కు రికార్డ్ తేదీ, ఎక్స్-డేట్‌ను జూలై 21గా ప్రకటించారు. డివిడెండ్ పొందాలంటే.. ఒక్క రోజే అవకాశం ఉంది. కాగా ఈ కంపెనీ తన వాటాదారులకు 96 శాతం లాభాన్ని అందించింది. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గాజు, సిరామిక్స్, డిటర్జెంట్లు, వ్యవసాయం, లోహశాస్, పారిశ్రామిక రసాయనాలు వంటి పరిశ్రమలలో ఉపయోగించే బోరాన్ ఆధారిత రసాయనాలు మరియు ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ సంస్థ వైవిధ్యభరితమైన ఉత్పత్తి శ్రేణితో దేశీయ, ఎగుమతి మార్కెట్లకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థ భారతదేశంలోని ప్రముఖ బోరాన్ రసాయన తయారీదారులలో ఒకటిగా ఉంది. ఇది బలమైన బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉంది.

Indo Borax

ఇండో బోరాక్స్ & కెమికల్స్ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 499 ఉండగా.. అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 224గా ఉంది. ఈ స్టాక్ గత నెల రోజుల్లో దాదాపు 29 శాతం రాబడి ఇచ్చింది. ఇక గత ఆరు నెలల్లో 92 శాతం లాభాన్ని అందించింది. ఒక సంవత్సరంలో దాదాపు 96 శాతం రాబడిని ఇచ్చింది. ఇక గత ఐదు సంవత్సరాల్లో ఈ స్టాక్ సుమారు 2025 శాతం పెరిగింది. ప్రస్తుతం ఇండో బోరాక్స్ & కెమికల్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1490 కోట్లుగా ఉంది. ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, FY26 నాల్గవ త్రైమాసికంలో రూ. 14.53 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.

ఈ సంస్థ FY26 నాల్గవ త్రైమాసికంలో రూ. 63.01 కోట్ల నిర్వహణ రాబడులను నమోదు చేసి, బలమైన పనితీరును కనబరిచింది. దేశీయ మార్కెట్లలో స్థిరమైన ఆర్డర్ల మధ్య, పటిష్టమైన అమలు, మెరుగైన సామర్థ్య వినియోగం, అధిక వసూళ్ల మద్దతుతో ఈ సంస్థ FY26 నాల్గవ త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరిచింది. కంపెనీ యాజమాన్యంలో ఇటీవల జరిగిన మార్పు కారణంగా వృద్ధి నమోదు చేసింది. అప్పుడు వాటాదారులకు ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 30 చొప్పున డివిడెండ్ ను ప్రకటించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+