layoffs: ఏటా వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్తున్నారు. వీరిలో అధికశాతం H1B వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లేఆఫ్ ల వల్ల అగ్రరాజ్యంలోని విదేశీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు H1B వీసా నిబంధనలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని అక్కడి భారతీయ సంస్థలు కోరుతున్నాయి.

ఇదీ H1B వీసా నిబంధన:
అగ్రరాజ్యం సాంకేతిక, నైపుణ్య అవసరాల కోసం ఏటా 10 వేల విదేశీ పౌరులను H1B వీసాపై నియమించుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు వారి విషయంలోనే ఇబ్బంది తలెత్తింది. ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఏవైనా కారణాల వల్ల ఒకవేళ ఉద్యోగం కోల్పోతే తిరిగి 60 రోజుల్లోపు మరో కొలువు సాధించాల్సి ఉంటుంది. లేని పక్షంలో తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాలి.

H1B గడువు పొడిగింపునకు పిటిషన్:
రెండు భారతీయ-అమెరికన్ సంస్థలు ఆన్ లైన్ లో ఓ పిటిషన్ ప్రారంభించాయి. లేఆఫ్ లలో తొలగించబడిన H1B వీసాదారులకు గ్రేస్ పీరియడ్ ని పొడిగించాలంటూ.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను అభ్యర్థించాయి. H1B వీసా గడువును ఏడాదికి కుదరని పక్షంలో 6 నెలలకు పొడిగించాలని కోరినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న లేఆఫ్ ల వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ స్థితిలో 2 నెలల్లోపు తిరిగి ఉద్యోగం సాధించడం జరిగే పనికాదు. అందుకే గడువు పొడిగిస్తే తమకు సాయంగా ఉంటుందని కొలువు కోల్పోయిన పలువురు ఉద్యోగులు భావిస్తున్నారు.

సాయంగా భారతీయ అమెరికన్ సంస్థలు:
ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా భారత్, చైనాకు చెందిన వలస ఉద్యోగులు అమెరికాలో ఎక్కువగా సేవలందిస్తున్నారు. భారతీయ అమెరికన్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల తరఫున, 'ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్' మరియు 'గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(GITPRO)' వంటి సంస్థలు ప్రెసిడెంట్ కు ఓ విజ్ఞప్తిని సమర్పించాయి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టరుకూ ఈ కాపీని పంపించాయి.

పిటిషన్ లో ఏముంది?
ఉద్యోగం కోల్పోయిన వారి కుటుంబ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని మానవతా దృక్ఫథంతో పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఆ సంస్థలు కోరాయి. అమెరికా సాంకేతికత, ఆవిష్కరణల్లో అగ్రగామిగా కొనసాగడంలో వీరి పాత్రను పరిణగణలోకి తీసుకోవాలని అభ్యర్థించాయి.
ఎన్నికైన అభ్యర్థులు, అధికారులు తమ పిటిషన్ కు మద్ధతు ఇవ్వాలని విఙప్తి చేశాయి. అవసరమైతే ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టాలని సూచించాయి. దీనిపై 2,200 మందికి పైగా సంతకాలు చేశారు.

భారత ప్రభుత్వానికి విఙప్తి:
మరోవైపు, USలో తొలగించబడిన భారతీయ టెక్ ఉద్యోగులను ఇండియాలో నియమించుకోవాలంటూ 'ఓవర్సీస్ భారతీయుల ఫేస్ బుక్ గ్రూప్' పిటిషన్ ప్రారంభించింది. కొనసాగుతున్న లేఆఫ్ లను దృష్టిలో ఉంచుకుని సాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఆయా మంత్రిత్వ శాఖలు చేపట్టిన డిజిటలైజేషన్ కార్యక్రమాల్లో.. ఇటీవల తొలగించబడి తిరిగి వచ్చిన భారతీయ ఐటీ ఉద్యోగులను కన్సల్టెంట్ లుగా నియమించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఉద్దేశించి రాసిన లేఖలో అభ్యర్థించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications