IT News: 2024లో భారతీయ టెక్కీలకు భారీ షాక్.. ఇన్నాళ్ల కలలు బూడిదలో పోసిన పన్నీరే..!!
H1B Visa Sponsorships: భారతీయ ఐటీ పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో భారీ మార్పులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందటంతో ఈ పరిశ్రమలో అనేక మార్పులు మెుదలయ్యాయి. ప్రధానంగా వీసాలతో పాటు విదేశీ వర్కర్ల విషయంలో ప్రస్తుతం అమెరికాలో పెనుమార్పులు కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ హెచ్1బీ వీసా ప్రక్రియలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు.. హెచ్1బీ వీసాలపై తమ ఉద్యోగులను నియమించుకున్న అనేక అమెరికా టెక్ కంపెనీలు భవిష్యత్తులో రాబోతే పరిస్థితులపై ప్రస్తుతం గందరగోళంలో ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించాల్సిన అసలు ట్విస్ట్ ఏంటంటే.. అమెరికాలోని భారతీయ టెక్ కంపెనీల కంటే యూఎస్ టెక్ పరిశ్రమకు చెందిన కంపెనీలు అధికంగా H1B వీసాల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు తేలాయి. అందువల్ల భారత్‌కు చెందిన పలువురు సాంకేతిక నిపుణులు హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో పనిచేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఇమ్మిగ్రేషన్ విధానం మార్పులు సవాలుగా నిలవనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో 2024లో అమెరికాకు చెందిన కంపెనీలు H1B స్పాన్సర్‌షిప్‌ను భారీగా తగ్గించుకున్నట్లు యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది. భారతీయ టెక్ కంపెనీలు ట్రంప్ గత హయాంలో నేర్చుకున్న పాఠాలతో ఇప్పటికే సంసిద్ధంగా ఉండటంతో ఆన్ సైట్ ఉద్యోగాల కోసం అవకాశాలను తగ్గించాయి. దీనికి బదులుగా అమెరికాలోని స్థానికులను భారతీయ ఐటీ కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకోవటానికి శ్రద్ధను పెంచాయి.
అసలు ఈ H1B వీసాలను అమెరికాకు చెందిన ఏఏ సంస్థలు భారీగా వాడుకుంటున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. అమెజాన్ సంస్థ గరిష్టంగా 9,265 H1B వీసాలను స్పాన్సర్ చేసింది. దీని తర్వాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్ 8,140, కాగ్నిజెంట్ 6320, గూగుల్ 5364, టీసీఎస్ 5274 మందికి, మెటా 4844 మందికి ఈ వీసాలను స్పాన్సర్ చేశాయని తేలింది. దీని తర్వాత కొంత తక్కువగా ఇమ్మిగ్రేషన్ వీసాలను వాడుకున్న కంపెనీల జాబితాలో.. మైక్రోసాఫ్ట్ 4725, ఆపిల్ 3873, హెచ్‌సీఎల్ అమెరికా 2953, ఐబీఎమ్ 2906 మందికి స్పాన్సర్ చేశాయి. గత సంవత్సరం అమెజాన్ 11,000 కంటే ఎక్కువ H1B వీసాలను స్పాన్సర్ చేసింది. దీని తర్వాత ఇన్ఫోసిస్, TCS కూడా తమ స్పాన్సర్‌షిప్‌లను క్రమంగా తగ్గించాయి.
మారుతున్న టెక్నాలజీ అవసరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనంలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఉద్యోగాల్లో అనే నియమాన్ని చాలా కంపెనీలు ప్రస్తుతం పాటించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి ఇంకా అనే అనుమానాలు చాలా మంది టెక్కీలతో పాటు భారతీయ ఐటీ కంపెనీలను కూడా భయాలకు లోనయ్యేలా చేస్తోంది. దీంతో హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కంటున్న భారతీయ టెక్ వర్కర్లు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి జారుకున్నారు. 2023లో అమెరికా మొత్తంగా 3,86,000 H1B వీసాలు జారీ చేయగా వాటిలో మెజారిటీ వాటా 2,79,000 అంటే 72.3% వీసాలను భారతీయులు దక్కించుకున్నారు. దీని తర్వాత ఎక్కువగా చైనా జాతీయులు 11.7% H1B వీసా పొందారు.


Click it and Unblock the Notifications