బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఇండిగో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది . మూడవ త్రైమాసికంలో కూడా ఎయిర్లైన్స్ మొత్తం ఆదాయం 50 శాతం క్షీణించి, 5,142 కోట్లకు చేరుకుందని ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూ3లో ఇండిగో 620 కోట్ల నికర నష్టాన్ని చవిచూసిందని తెలిపింది. కరోనా లాక్డౌన్ సమయం నుంచి తీవ్ర నష్టాలను చవి చూస్తున్న ఇండిగో ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో 2884 కోట్లు, మరియు సెప్టెంబర్ త్రైమాసికంలో 1194 కోట్లు నష్టాలను చవిచూసింది

మూడో త్రైమాసికంలో 620 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసిన ఇండిగో
2020 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 620 కోట్ల రూపాయల నికర నష్టాన్ని బడ్జెట్ క్యారియర్ ఇండిగో గురువారం నివేదించింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 6,496 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ మరియు సెప్టెంబర్ త్రైమాసికంలో, వైమానిక సంస్థ వరుసగా నష్టాల బాట పట్టింది
. డిసెంబర్ త్రైమాసికంలో దాని మొత్తం ఖర్చులు 41% పడిపోయి, 7 5,765 కోట్లకు చేరుకున్నాయి.

అంతర్జాతీయ విమానాలు పునరుద్ధరిస్తే నష్టాలను అధిగమించవచ్చని ఆశాభావం
తమ సంస్థ పై వినియోగదారుల విశ్వాసం పూర్తిగా ఉందని, సంస్థ కోలుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవడానికి వినియోగదారుల సహకారం తమకు ఉంటుందని ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ విమానాలు పునరుద్ధరిస్తే ఈ నష్టాలను అధిగమించవచ్చని విమానయాన సంస్థ ఆశగా ఎదురుచూస్తుంది.
ఈ త్రైమాసికంలో ఆక్యుపెన్సీ రేటు 72% అని ఎయిర్లైన్స్ తెలిపింది, ఇది ఏడాది క్రితం 87.6% గా ఉంది.

కరోనా దెబ్బ నుండి ఇంకా కోలుకొని వైమానిక సంస్థలు
లాక్డౌన్ కారణంగా భారతదేశంలో మార్చి 25 నుండి మే 24 వరకు షెడ్యూల్డ్ దేశీయ విమాన సేవలను నిలిపివేశారు. దేశీయ విమానాలు మే 25 నుండి తిరిగి ప్రారంభమయ్యాయి, కాని తగ్గించబడిన పద్ధతిలో విమానయాన సేవలు కొనసాగుతున్నాయి.
ఇక డిసెంబర్ 31 నాటికి ఇది 60 దేశీయ నగరాలకు విమాన సేవలను అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
ఏది ఏమైనా కరోనా ప్రభావంతో విమానయాన రంగంలో నెలకొన్న పరిస్థితి వివిధ వైమానిక సంస్థలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది. అందులో భాగంగానే ఇండిగో కూడా మూడవ త్రైమాసికంలో 620 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.

తీవ్ర నష్టాల్లో విలవిలలాడుతున్న విమానయాన సంస్థ ఇండిగో
భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో మొత్తం 18,365 కోట్ల నగదు బ్యాలెన్స్ కలిగి ఉంది. ఇందులో, 7,444 కోట్ల ఉచిత నగదు మరియు, 10,920 కోట్ల "పరిమితం చేయబడిన నగదు" ఉన్నాయి. పరిమితం చేయబడిన నగదు సంస్థకు వెంటనే అందుబాటులో లేదు మరియు ఇది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే కేటాయించబడింది. భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో కూడా ఇప్పుడు తీవ్ర నష్టాల్లో విలవిలలాడుతుంది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications