ఇండిగో ఎయిర్ లైన్స్ తమ కస్టమర్లకు లగేజీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ప్రయాణీకుల ఇంటికే బ్యాగేజీని చేర్చే సేవలు ప్రారంభించింది. కొంతమంది ప్రయాణీకులు అధిగ లగేజీతో ప్రయాణాలు చేస్తారు. వారికి తమతో పాటు లగేజీ తీసుకు వెళ్లడం ఇబ్బందికరం. ప్రయాణానికి ముందు బ్యాగేజీని కౌంటర్‌లో అప్పగించి మళ్లీ గమ్యస్థానంలో అది చేతికి వచ్చే వరకు వేచి చూడాలి. ఇలా చాలామంది ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. వారికి ఇండిగో శుభవార్త చెప్పింది.
ప్రయాణీకుల ఈ సమస్య నివారణకు ఇండిగో డోర్ టు డోర్ బ్యాగేజ్ ట్రాన్సుఫర్ సర్వీసును 6ఇబ్యాగ్‌పోర్ట్ అనే పేరుతో ప్రారంభించింది. మొదట ఈ సేవలను ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఆవిష్కరించింది. మలిదశలో కార్టర్ పోర్టర్ అనే సంస్థతో కలిసి ముంబై, బెంగుళూరు సిటీల్లో ఈ సేవలు అందించనుంది. విమాన ప్రయాణానికి 24 గంటల ముందుగా ఈ సేవలు ప్రయాణికులకు లభిస్తాయి.

కార్టర్ ఎక్స్ వేదిక www.6EBagPort, carterporter.in ద్వారా కూడా కస్టమర్లు ఈ సేవలను అందుకోవచ్చు. 6EBagPort ద్వారా ప్రయాణీకులు లగేజీని ట్రాకింగ్ చేయవచ్చు. ప్రయాణీకులు విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు నుండి, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇంటి నుండి ఎయిర్ పోర్టుకు లేదా విమానాశ్రయం నుండి ఇంటికి లగేజీని పంపించవచ్చు. ఒకసారి ట్రాన్సుఫర్‌కు రూ.630 చెల్లించాలి. బ్యాకేజీకి రూ.5వేల చొప్పున సర్వీస్ ఇన్సురెన్స్ ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications