Indigo: క్యూట్‌గా ఉంటే ఛార్జీలు వసూలు చేస్తారా..? వైరల్ గా మారిన విమాన ప్రయాణికుడి ట్వీట్..
Viral Tweet: ఎవరైనా క్యూట్‌గా ఉండటం ఉచితమే. అయితే మీరు ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే, మీరు దాని కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుందా? ఒక ప్రయాణీకుడు ఇటీవల ట్విట్టర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్ ఛార్జీలకు సంబంధించిన ఒక స్క్రీన్ షార్ట్ షేర్ చేశాడు. అందులో క్యూట్ ఛార్జీల పేరుతో రూ.100 రుసుము వసూలు చేయటం గమనించాడు. అరె అందంగా ఉంటే దానికి కూడా ఛార్జీలు వసూలు చేస్తారా.. అంటూ అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. "నేను వయస్సుతో క్యూట్ అవుతున్నానని నాకు తెలుసు, కానీ @IndiGo6E దాని కోసం నా దగ్గరి నుంచి రుసుము వసూలు చేయడం ప్రారంభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అంటూ రాశాడు.
హాస్యంతో కూడిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే ట్విట్టర్ లో వైరల్‌గా మారింది. కొంతమంది వ్యక్తులు ఈ CUTE ఛార్జీల గురించి వివరించడానికి ప్రయత్నించగా, మరికొందరు మాత్రం దానిపై తమదైన శైలిలో స్పందించారు. స్క్రీన్‌షాట్‌లో శంతను అనే ప్రయాణికుడు తన విమాన ఛార్జీల్లో క్యూట్ ఛార్జీలను హైలైట్ చేశాడు. అనేక మంది దీనిని రీట్వీట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇండిగోతో జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ ఒకరు రాయగా, క్యూట్ గా ఉంటే టాక్స్ వేస్తారా అంటూ మరొకరు ఫన్నీగా స్పందించారు. మండుతున్న విమానంలో ప్రయాణిస్తున్నందుకు త్వరలో లైఫ్ సేవింగ్ ఛార్జీల పేరుతో కొత్త రుసుములను విమానయాన కంపెనీలు వసూలు చేయవచ్చని మరొకరు కామెంట్ చేశారు.

'కామన్ యూజర్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్' ఛార్జీలను CUTE అని వ్యవహరిస్తారు. దీనిని ఎయిర్‌పోర్ట్‌లో మెటల్ డిటెక్టింగ్ మెషీన్లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను వినియోగించినందుకు గాను వసూలు చేసే ఛార్జీలు ఉంటాయి. CUTE రుసుమును కొన్నిసార్లు ప్రయాణీకుల నిర్వహణ రుసుము అని కూడా పిలుస్తారు. ఒక ఎయిర్‌పోర్టు నుంచి మరో ఎయిర్‌పోర్ట్‌కు ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 లేదా రూ.100ను క్యూట్ కింద వసూలు చేస్తుంటాయి విమాన సంస్థలు.


Click it and Unblock the Notifications