భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెయింట్ కంపెనీలలో ఒకటైన ఇండిగో పెయింట్స్ యొక్క పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ యొక్క రెండవ రోజు కూడా పెట్టుబడిదారుల నుండి మంచి స్పందన లభించింది. జనవరి 21 న ఇప్పటివరకు పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ కంపెనీ అనుకున్నదానికంటే 6.8 టైమ్స్ అదనంగా సబ్ స్క్రిప్షన్ పొందిందని తెలుస్తుంది.

ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూకి మంచి రెస్పాన్స్
ఇండిగో పెయింట్స్ ఐపీవో జనవరి20న ప్రారంభమై జనవరి 22న ముగుస్తుంది. ఇది రూ.58,40,000 షేర్లు జారీ చేసింది. ఉద్యోగులతో సహా పెట్టుబడిదారులు 55.18 లక్షలకు పైగా ఈక్విటీ షేర్ల ఆఫర్ సైజు ఆఫర్ కు , 3.76 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు పెట్టారని ఎక్స్ఛేంజీలలో లభించే డేటా చూపించింది. రిటైల్ పెట్టుబడిదారుల రిజర్వు చేసిన భాగం 9.4 రెట్లు కాగా , ఉద్యోగుల సంఖ్య 1.8 రెట్లు పెరిగింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోసం కేటాయించిన భాగం 3.85 వంతు సభ్యత్వం పొందింది .

రెండో రోజు సబ్ స్క్రిప్షన్ కోసం పోటీ
సంస్థేతర పెట్టుబడిదారులు తమకు రిజర్వు చేసిన భాగాని కంటే ఎక్కువగా 5.16 రెట్లు బిడ్లు ఇచ్చారు.ప్రారంభ రోజు జనవరి 20 న పబ్లిక్ ఇష్యూ 1.9 రెట్లు చందా చేయబడింది. రెండో రోజు 6.8 టైమ్స్ అదనంగా బిడ్డింగ్ చేశారు. మూడు రోజుల ఆఫర్ జనవరి 22 తో ముగుస్తుంది. ఐపిఓలో తాజాగా 300 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ప్రమోటర్ (హేమంత్ జలన్) మరియు పెట్టుబడిదారులు 58,40,000 ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్‌ను కలిగి ఉంది.

ఐపీఓ నిధులను విస్తరణకు ,రుణ చెల్లింపులకు వినియోగించనున్న ఇండిగో పెయింట్స్
కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం ఇండిగో పెయింట్స్ ఐపీఓ నిధులను విస్తరణకు , తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది. అదేవిధంగా మరికొన్ని రుణ చెల్లింపులకు కూడా వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. మొత్తం వెయ్యి కోట్లను సమీకరించే ఆలోచనలో ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది . ఇక పెట్టుబడి దారి నుండి ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూకు విశేష స్పందన వస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications