ప్రపంచీకరణ నేపథ్యంలో ఇండియాలో విమాన ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్ ను అందుకునేందుకు దేశీయ విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన ఎయిర్ ఇండియా.. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి 470 ఎయిర్ క్రాఫ్ట్ లు ఆర్డర్ చేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. మరో 370ని రానున్న రోజుల్లో సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సైతం టాటాల బాటలో నడవడానికి సిద్ధమైంది.

ఒకేసారి 500 విమానాల ఆర్డర్
గురుగ్రాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ విమానయాన సంస్థ ఇండిగో షాకింగ్ ప్రకటన చేసింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కలిసి యూరప్ కు సైతం తన పరిధిని విస్తరించడానికి సిద్ధపడినట్లు పేర్కొంది.
ఈ ప్రణాళికలో భాగంగా 500 విమానాల కోసం ఆర్డర్ చేసినట్లు ఇండిగో అంతర్జాతీయ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. భారత్ నుంచి ఇస్తాంబుల్, యూరప్ వెళ్లే ప్రయాణీకులకు సేవలను మరింత మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టర్కీ, యూరప్ లే లక్ష్యంగా..
"ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను మేము నడుపుతున్నాం. వాటిలో 10 శాతం అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అవి కూడా భారత ఉపఖండంతో పాటు కొన్ని దేశాల చుట్టూనే పరిమితమై ఉన్నాయి. మరింత దూరం వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నాం. టర్కీ, యూరప్ లోకి చొచ్చుకుపోవాలని ప్రణాళికలు రచించాం. అందుకే టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కోడ్ షిప్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం" అని వినయ్ తెలిపారు. ఎయిరిండాయా తరహాలోనే ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి వీటిని ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు.

పోటీని స్వాగతిస్తాం
ఎయిరిండియా 470 విమానాలు ఆర్డర్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఇండిగో నుంచి ఈ ప్రకటన రావడంపై మల్హోత్రా స్పందించారు. పోటీని ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ పొందిన భారతీయులు మొదటగా విదేశాలకు వెళ్లాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి సరిహద్దులు చెరిపేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నట్లు చెప్పారు.

విదేశాల్లో రెండు చోట్ల పాయింట్లు:
భవిష్యత్తులో కెన్యాలోని నైరోబి, ఇండొనేషియాలోని జకార్తాలో మరో రెండు కొత్త పాయింట్లను ప్రారంభించనున్నట్లు వినయ్ ప్రకటించారు. కొన్ని దేశీయ మార్కెట్‌లో, మరికొన్ని విదేశాల్లో మోహరించబడతాయని వెల్లడించారు. యూరప్ కు అత్యుత్తమ కనెక్టివిటీని అందిచనున్నట్లు పేర్కొన్నారు. క్యారియర్ సేవల్లో అవాంతరాలు లేకుండా సరసమైన ధరలతో, సమయానుకూల పనితీరు కనబరచనున్నట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications