Indigo News: దేశీయ విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో ఆయా ఎయిర్‌లైన్స్ మంచి లాభాలను పోస్ట్ చేస్తున్నాయి. ఈ రంగంలోని ప్రముఖ ప్లేయర్ ఇండిగో కూడా మూడవ త్రైమాసికంలో సత్తా చాటింది.
భారతదేశపు అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో.. డిసంబరుతో ముగిసిన తన త్రైమాసిక ఫలితాలను ఇవాళ ప్రకటించింది. దాని మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ నికర లాభం 111 శాతం మేర భారీ వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది. విమాన ప్రయాణానికి పెరిగిన నిరంతర డిమాండ్ మరియు అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఇంధన సర్‌ఛార్జ్ సత్ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడించింది.

ఇండిగో మొత్తం ఆదాయం 15 వేల 410 కోట్ల నుంచి 20 వేల 062 కోట్లకు పెరిగనట్లు సంస్థ పేర్కొంది. తద్వారా 30 శాతం వృద్ధి కనిపించిందని వివరించింది. గతంలోని 1,422 కోట్ల నుంచి నికర లాభం 2,998 కోట్లకు చేరినట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ త్రైమాసికంలో 62.1 శాతం మార్కెట్ వాటాను కలిగి 243.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చినట్లు రిపోర్ట్ చేసింది.
ఏడాది క్రితం ఇండిగో 199.70 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లి 55.7 శాతం మార్కెట్ వాటాను సాధించింది. దీంతో కరోనా ముందు సంవత్సరం 2019 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోని 181.82 లక్షల మందితో 47.5 శాతంగా ఉన్న మార్క్ షేర్‌ను అధిగమించింది. మునుపటి రెండు క్వార్టర్స్‌లోనూ అంతకంతకూ లాభాలను పెంచుకుంటూ పోయింది. తద్వారా మార్కెట్ అంచనాలను అధిగమించగలిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications