ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత భారత దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే స్పైస్ జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రాయానికి వెంటనే తిరిగి వచ్చింది. తాజాగా చెన్నై చేరుకున్న ఇండిగో విమానంలో సమస్య కారణంగా బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
వివరాల ప్రకారం.. అస్సాం రాజధాని గువహటి నుంచి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే.. విమానంలో చాలా ఇంధనం తక్కువగా ఉండటం వల్ల పైలట్ వెంటనే మే డే కాల్ ప్రకటించారు.

ఎయిర్‌బస్ A321 విమానం గౌహతి విమానాశ్రయం నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి 7:45 గంటలకు చెన్నైలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానంలో ఇంధనం చాలా తక్కువగా ఉండటంతో పైలట్ సమయానికి చేరాల్సిన ప్రదేశానికి చేరుకోలేకపోయాడు. దీంతో వెంటనే విమానంలో ఇంధనం తక్కువగా ఉందంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) విభాగానికి సమాచారం అందించారు.
ఫైలెట్ అలర్ట్ అయి ఏటీసీకి మే డే.. మేడే.. ఫ్యూయల్ డౌన్ సంకేతం ఇవ్వడంతో వెంటనే ఏటీసీ అప్రమత్తం అయింది. పైలెట్ వెంటనే విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ కోసం బెంగుళూరు విమానాశ్రయానికి మళ్లించారు. ఈ లోపే ఏటీసీ విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే వారంతా విమానం ల్యాండింగ్ అయిన ప్రాంతానికి మెడికల్, ఎమర్జెన్సీ కిట్స్ తో వెళ్లారు. అయితే విమానం ఎయిర్ పోర్టుతో సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజుకు 2,000 విమానాలను నడుపుతోంది. ఈ సంఘటనపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.కాగా విమానం అకస్మాత్తుగా నిలువుగా తిరగడం ప్రారంభించిందని విమానంలోని ప్రయాణికులు తెలిపారు. దీని వల్ల ప్రయాణికులందరూ గత ప్రమాదం తలుచుకుని ఒక్కసారిగా భయపడ్డారు.
ఇదిలా ఉంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లను విధుల నుండి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించిందని వివిధ మీడియా సంస్థలు కూడా నివేదించాయి. దీనిని గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ అధికారికంగా ధృవీకరించలేదు.కాగా ఈ సంఘటన తర్వాత DGCA ఇండిగో ఇంధన విధానాలను సమీక్షించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ సంఘటన 60% మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఇండిగోపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్యే గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మరణించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో మరో విమానం కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలతో విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు.


Click it and Unblock the Notifications