నిర్వహణ లోపాలతో ఇండిగో (IndiGo) విమాన సర్వీసులు వందల సంఖ్యలో రద్దు అయ్యిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా, డిసెంబర్ 5 నుండి 15వ తేదీ మధ్య ప్రయాణాలకు సంబంధించి పూర్తి రీఫండ్ (Full Refund) లేదా ఉచితంగా టికెట్ రీబుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రకటించింది. మీ ఇండిగో విమానం రద్దయినా లేదా ఆలస్యమైనా.. మీ డబ్బులు మీకు తిరిగి ఎలా పొందాలో (లేదా) టికెట్ ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

విమానం రద్దయితే..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. విమానయాన సంస్థలు విమానాన్ని రద్దు చేసినా లేదా నిర్ణీత సమయానికి నడపకపోయినా.. ప్రయాణికులకు ఈ కింది హక్కులు ఉంటాయి.
- పూర్తి రీఫండ్: ప్రయాణికులు టికెట్‌కు చెల్లించిన డబ్బును పూర్తిగా తిరిగి పొందే హక్కు ఉంటుంది.
- ఉచిత రీబుకింగ్: ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా తర్వాత అందుబాటులో ఉన్న వేరే విమానానికి టికెట్‌ను మార్చుకునే అవకాశం (Rebooking) ఉంటుంది.
- నాన్-రీఫండబుల్ టికెట్లకు కూడా: నాన్-రీఫండబుల్ (Non-Refundable) లేదా ప్రమోషనల్ టికెట్లకు కూడా ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో పూర్తి రీఫండ్ వర్తిస్తుంది.
- చెల్లింపు పద్ధతి: మీరు టికెట్ కొనుగోలుకు ఏ విధంగా డబ్బులు చెల్లించారో (ఆన్‌లైన్ లేదా క్యాష్) అదే పద్ధతిలో రీఫండ్ ఇవ్వడం ఎయిర్‌లైన్ బాధ్యత.
రీఫండ్ & రీబుకింగ్ విధానం
మీ ఇండిగో విమానం రద్దయితే.. రీఫండ్ లేదా రీబుకింగ్ కోసం ఇలా చేయొచ్చు..
- ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి వెళ్లండి.
- అందులో కనిపించే 'Manage Booking' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ PNR నంబరు/బుకింగ్ రిఫరెన్స్, చివరి పేరు (Last Name) ఎంటర్ చేసి మీ బుకింగ్‌ను చెక్ చేయండి. మీ విమానం రద్దైనట్లు ఇక్కడ చూపిస్తుంది.
- విమానం రద్దయినట్లు చూపించినప్పుడు.. మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి: Full Refund లేదా Extra ఛార్జీలు లేకుండా Rebook చేసుకోవడం.
- మీకు ఏది కావాలో ఆ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు రీఫండ్ కావాలనుకుంటే, 'Cancellation/Refund' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ PNR, ఈమెయిల్ ఐడీ, ఇతర వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
రీఫండ్ ఎలా వస్తుంది?
- ఆన్‌లైన్ చెల్లింపు: మీరు ఆన్‌లైన్‌లో (కార్డులు/నెట్ బ్యాంకింగ్) చెల్లించి ఉంటే, రీఫండ్ మొత్తం 5-7 పని దినాల్లో (Business Days) మీ బ్యాంక్ ఖాతా లేదా కార్డులోకి తిరిగి జమ అవుతుంది.
- నగదు చెల్లింపు: నగదు రూపంలో చెల్లించి ఉంటే, మీరు ఎయిర్‌పోర్ట్‌లోని టికెట్ కౌంటర్‌ను సంప్రదించి.. టికెట్, ఐడీ ప్రూఫ్ చూపించి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.
- ట్రావెల్ ఏజెంట్లు/థర్డ్ పార్టీ పోర్టల్స్: మీరు ఏజెంట్ ద్వారా లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా బుక్ చేసి ఉంటే.. ఆ ఏజెన్సీలే రీఫండ్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. సహాయం కోసం వారిని సంప్రదించొచ్చు.
రీబుకింగ్ చేయాలనుకుంటే..
విమానం రద్దయిన వెంటనే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి రీషెడ్యూల్ లింక్ వస్తుంది.
ఆ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలు ఎంటర్ చేసి, మీరు ప్రయాణించాలనుకుంటున్న వేరే తేదీని ఎంచుకుని ఉచితంగా బుకింగ్ మార్చుకోవచ్చు. రీఫండ్ స్టేటస్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు మీ ఈమెయిల్‌కు వస్తుంటాయి. ఒకవేళ 7-10 పని దినాల్లోపు మీకు రీఫండ్ రాకపోతే, వెంటనే ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించడం మంచిది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications