ఈ నెల ప్రారంభంలో (డిసెంబర్ 3 నుంచి 5 మధ్య) ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాలు, విమానాల రద్దు ( IndiGo Flight Cancellations) దేశవ్యాప్తంగా ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. టిక్కెట్లు రద్దు కావడంతో ప్రయాణాలు వాయిదా పడ్డాయి. అయితే ఈ సంక్షోభం నుంచి ఇండిగో నెమ్మదిగా కోలుకుంటున్నట్లు ప్రకటించింది. గురువారం నాటికి రోజుకు 1,950 కంటే ఎక్కువ విమానాలను నడపాలని, సుమారు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాల్లొకి వెళ్తే..

ఇండిగో విమానాల రద్దు, భారీ అంతరాయాల చాలామంది నష్టపోయారు. అయితే తమ వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన ప్రయాణికులకు ఇండిగో(IndiGo) ఒక పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి.. వారికి రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఇండిగో (IndiGo) తమ కస్టమర్ లకు మద్దతుగా నిలబడాలనే నిబద్ధతను చాటుకుంటోంది.
ట్రావెల్ వోచర్ల పంపిణీ
విమానాల రద్దు లేదా తీవ్ర జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులను గుర్తించి ఇండిగో ఈ ట్రావెల్ వోచర్లను పంపిణీ చేస్తోంది. ఈ వోచర్ విలువ రూ. 10,000. ఈ వోచర్లను రాబోయే 12 నెలల (ఒక సంవత్సరం) లోపు బుక్ చేసుకునే ఏ ఇండిగో విమాన టిక్కెట్ల కోసమైనా ఉపయోగించుకోవచ్చు.
ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో "కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. అత్యంత ప్రభావితమైన కస్టమర్ లకు మేము రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తున్నాము. ఇది వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాము." అని తెలిపారు.
అదనంగా పరిహారం..
విమానయాన సంస్థలు పాటించాల్సిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. విమానం రద్దయినా లేదా 24 గంటల కంటే తక్కువ సమయంలో జాప్యం జరిగినా, విమాన సమయాన్ని బట్టి రూ.5,000 నుండి రూ.10,000 వరకు నష్టపరిహారం చెల్లించడం తప్పనిసరి. ఇండిగో ఇప్పుడు ఈ చట్టపరమైన పరిహారంతో పాటు అదనంగా రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్ ను అందించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందాలని ప్రయత్నిస్తోంది. అంటే విమానం రద్దు అయిన ప్రయాణీకులు తగిన నష్ట్ పరిహారంతో పాటు అదనంగా ఈ వోచర్లు పొందుతారు. తద్వారా తమకు జరిగిన నష్టం నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.
రిఫండ్‌ల వేగవంతం
రద్దయిన విమానాలకు సంబంధించిన అన్ని రిఫండ్‌లను కూడా ప్రాసెస్ చేశామని ఇండిగో స్పష్టం చేసింది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బుక్ చేసుకున్న వారికి కూడా ఈ రిఫండ్‌లు అందజేయబడ్డాయి. ఈ చర్యలతో ఇండిగో(IndiGo) తన సాధారణ కార్యకలాపాలను స్థిరీకరించడంతో పాటు భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మరింత మంది క్యూ అండ్ స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఇంత పెద్ద సంక్షోభం తర్వాత కూడా ఇండిగో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందేమో చూడాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications