భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో (IndiGo).. చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, టైమ్‌టేబుల్ లోపాల కారణంగా ఇండిగో ఒక్క రోజులోనే 550 కి పైగా విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. వేలమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..

సాంకేతిక లోపం, సిబ్బంది లేకపోవడం వంటి పలు ఇబ్బందుల కారణంగా ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క రోజే దేశవ్యాప్తంగా సుమారు 550 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై (118), బెంగళూరు (100), హైదరాబాద్ (75), కోల్‌కతా (35), చెన్నై (26), గోవా (11) వంటి ప్రధాన విమానాశ్రయాలు పూర్తిగా గందరగోళంలో చిక్కుకున్నాయి. వరుసగా నాలుగు రోజులు సమస్యలు కొనసాగడంతో.. చాలా విమానాల రద్దు చేశారు. తమ ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినడంతో.. ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గోవా వంటి చోట్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
లక్షల్లో టికెట్ ధరలు
ఇండిగో విమానాల రద్దు దేశవ్యాప్తంగా ప్రయాణికులనే కాకుండా.. మొత్తం విమానయాన మార్కెట్‌ను దెబ్బతీసింది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో ఇతర విమానయాన సంస్థల ఫ్లైట్ టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి భోపాల్ కు ఎయిర్ ఇండియా సర్వీస్ టికెట్ ధర ఒక్కసారిగా రూ.1.03 లక్షలు చేరింది. బెంగళూరుకు వెళ్లాలనుకున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ల ధర రూ.38,000 వరకూ చేరుకుంది. హైదరాబాద్ నుంచి ముంబై ఫ్లైట్ టికెట్ రూ.41,000(ఎయిర్ ఇండియా) ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ ధరలు రూ. 47,000.. ఇలా ధరలు విపరీతంగా పెరగడంతో మధ్యతరగతి ప్రయాణికులు తీవ్ర భారాన్ని మోయాల్సి వచ్చింది.
ప్రయాణీకుల తిప్పలు
ఇండిగో రీషెడ్యూల్ చేయకుండా కేవలం డబ్బులు వెనక్కి ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నవాళ్లు, టూరిస్టులు అక్కడే చిక్కుకుపోయారు. వరుస రీషెడ్యూళ్లు, ఇన్ఫర్మేషన్సరిగ్గా లేకపోవడం వల్ల ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలీక అయోమయంలో పడిపోయారు.
ప్రభుత్వ జోక్యం
ఇండిగో యాజమాన్యం ఈ సమస్యలకు 'క్రూ లేకపోవడం, ప్లానింగ్ లోపం, టెక్నాలజీ సమస్యలు' కారణమని అంగీకరించింది. ముఖ్యంగా, 'నైట్-డ్యూటీ రూల్స్' మారిన తర్వాత సిబ్బంది అవసరాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation), డీజీసీఏ (DGCA) అధికారులు ఇండిగో సీనియర్ మేనేజ్‌మెంట్ తో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రి ఆదేశం..
పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ అంతరాయాలను "తీవ్రంగా పరిగణించారు". రద్దుల కారణంగా విమాన ఛార్జీలు పెరగకుండా నిశితంగా పర్యవేక్షించాలని DGCAని ఆదేశించారు. ఇండిగో తమ కార్యకలాపాలు ఫిబ్రవరి 10, 2026 నాటికి పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని డీజీసీఏకి తెలియజేసింది.
ఇండిగో సాధారణంగా రోజుకు దాదాపు 2,300 ఫ్లైట్లు నడుపుతుంది. ఇప్పుడు ఇలా జరగడంతో ఆ సంస్థ రేటింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇండిగో వంటి అతిపెద్ద సంస్థ యొక్క ఆన్-టైమ్ పనితీరు 35 శాతం నుంచి ఒక్కసారిగా 19.7 శాతానికి పడిపోవడం భారత విమానయాన రంగానికి ఆందోళన కలిగించే అంశం. ఈ సంక్షోభం త్వరగా ముగిసి ప్రయాణికులకు ఉపశమనం లభించాలని ఆశిద్దాం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications