శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చెన్నై విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిన నిర్ణయం తర్వాత..ఇప్పటికే నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న గందరగోళం ఈరోజు ఐదో రోజుకు చేరుకుంది. ఇండిగో కార్యాచరణ అంతరాయాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఉదయం నుంచే ప్రయాణికులు భారీ క్యూల్లో నిలబడి, ప్రయాణం కొనసాగుతుందా లేదా రద్దు అవుతుందా అన్న అనిశ్చితిలో మగ్గిపోయారు.
వార్తా సంస్థ పిటిఐ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం చెన్నై విమానాశ్రయంలో 28 బయలుదేరే విమానాలు, 20 ఆన్-అరైవల్ విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఈ సమాచారం మొదటగా చెన్నై విమానాశ్రయం అధికారిక X అకౌంట్‌లో పోస్ట్ చేయబడింది.. అయితే కొద్ది గంటల తర్వాత ఆ పోస్ట్ తొలగించబడింది. ప్రయాణికులు ఇప్పటికే విమానాశ్రయంలో గందరగోళానికి గురై చిక్కుకుపోయారు. నిరాశ, కోపం, అయోమయంతో వారు అక్కడ ఉన్నారు.

ప్రభావిత ప్రయాణికులకు సహాయం అందించడానికి చెన్నై విమానాశ్రయం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. నంబర్లు 044-22565113, 044-22565112**. మరోవైపు ఈ గందరగోళం వల్ల అత్యవసర వైద్య ప్రయాణాలు, పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు, విదేశీ కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రయాణికులు X, Instagramలో వీడియోల ద్వారా తమ అసహాయ స్థితిని పంచుకున్నారు.
ఇక ఢిల్లీలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని దేశీయ విమానాలను ఇండిగో రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటన చేస్తూ.. ఇండిగో కార్యకలాపాలు ఇప్పుడు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలిపింది. ప్రయాణీకులు ఇంటి నుండి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని మరోసారి తనిఖీ చేయాలని సూచించారు.
ఈ సంక్షోభానికి అసలు కారణం ఏమిటి? గత నాలుగు రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ఇండిగో విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ అంతరాయానికి ప్రధాన కారణం కొత్త Flight Duty Time Limit (FDTL) నిబంధనల అమలు. పైలట్లకు విశ్రాంతి సమయం పెరగడంతో సిబ్బంది కొరత ఏర్పడి, పెద్ద సంఖ్యలో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆపరేషనల్ సిస్టమ్ ఒక్కసారిగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు స్థంభించిపోయాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, పైలట్లకు వారపు విశ్రాంతి సంబంధించిన కొత్త విధానాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజారపు మాట్లాడుతూ, ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు బాధ్యులో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.
విమాన భద్రతపై రాజీ పడకుండా, ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆయన అంచనా ప్రకారం రేపటి నాటికి విమాన షెడ్యూల్ స్థిరీకరణ ప్రారంభమై, సేవలు సాధారణ స్థితికి వస్తాయి. భారతదేశంలో అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉన్న విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో, ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అరుదు. ఇప్పుడు దేశం మొత్తం ఇండిగో ఎలా తిరిగి సాధారణ స్థితికి వస్తుందా అని ఎదురుచూస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications