కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో టూరిజం, హోటల్స్ అండ్ రెస్టారెంట్‌తో పాటు విమానయానం ఉంది. ఈ రంగాల్లోనే ఎక్కువగా ఉద్యోగాల కోత, వేతన కోతలు కనిపించాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో రెండోసారి వేతనకోతను ప్రకటించింది. ఇదివరకు మొదటిసారి వేతన కోత విధించింది. ఇప్పుడు రెండో రౌండ్ భారీ వేతన కోతలను ప్రకటించింది.

సీనియర్ ఉద్యోగులకు 35 శాతం కోత
సీనియర్ ఉద్యోగులకు 35 శాతం వరకు వేతన కోత అమలు చేస్తున్నట్లు సోమవారం ఇండిగో ప్రకటించింది. నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదివరకు మే నెలలో సీనియర్ ఉద్యోగులకు 25 శాతం వేతన కోత అమలు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే కరోనా కారణంగా 10 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు జూలై 20వ తేదీన ప్రకటించింది. ఇప్పుడు సీనియర్ ఉద్యోగులకు వేతన కోతను 35 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా ఈ-మెయిల్ పంపించారు.

సీఈవో వేతనంలోను కోత.. సెప్టెంబర్ 1 నుండి
సీఈవో వేతనంలోను 35 శాతం కోత ఉంటుంది. తన వేతనంలో 35 శాతం కోత విధించుకుంటున్నానని, అందరు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అంతకుమించి హోదాల్లో ఉన్నవారు 30 శాతం వేతన కోతకు అంగీకరించాలని కోరారు. పైలట్లకు వేతన కోతను 28 శాతానికి పెంచామని, వైస్ ప్రెసిడెంట్స్‌కు 25 శాతం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్‌కు 15 శాతం వేతన కోత విధిస్తున్నట్లు తెలిపారు. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని చెప్పారు. ఏ, బీ విభాగాల ఉద్యోగులకు కోత విధించలేదు.

వేతనం లేని సెలవులు
ప్రతి నెలలో ఉద్యోగులకు వేతనం లేని సెలవులను 5 రోజులు తప్పనిసరి చేశారు. ఈ ప్రకటన మే నెలలో చేశారు. దీనిని ఆగస్ట్‌లో రెండింతలు చేశారు. వచ్చే నెల నుండి వేతనం లేని సెలవులను 10.5 రోజులకు పెంచుతోంది. ప్రస్తుతానికి ఇందులో మార్పులు చేయలేదని, పని భారానికి అనుగుణంగా ఆయా విభాగాలు, సిబ్బందికి సెప్టెంబర్ నుండి ఎంత మేర వేతనం లేని సెలవులు ఇవ్వాలో నిర్ణయిస్తామని తెలిపారు. కరోనా కారణంగా విమాన సర్వీసులు రెండు నెలల పాటు నిలిపివేయబడ్డాయి. మే 25వ తేదీన తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు 250 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా, ప్రస్తుతం ఇందులో కొన్ని మాత్రమే నడుస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications