న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మార్చి నుండి లాక్ డౌన్ కాలంలో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు రద్దయిన కాలానికి సంబంధించి కస్టమర్ల క్రెడిట్ షెల్స్‌ను తిరిగి చెల్లిస్తామని, వీటిని జనవరి 31, 2021 నాటికి అందిస్తామని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సోమవారం ప్రకటించింది. ఇప్పటికే రూ.1,000 కోట్ల వరకు కస్టమర్లకు రీఫండ్ చేసినట్లు తెలిపింది. తద్వారా కస్టమర్లకు చెందిన దాదాపు 90 శాతం మొత్తాన్ని రీఫండ్ చేశామని తెలిపింది.

ఆదాయం లేకపోవడంతో...
ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజాయ్ దత్తా మాట్లాడుతూ... కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో విమానయాన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. కార్యకలాపాలు లేకపోవడంతో తమ ఆదాయం పూర్తిగా లేకుండా పోయిందని, అందుకే రద్దైన విమాన సర్వీసులకు సంబంధించి వెంటనే రీఫండ్ చేయలేకపోయామన్నారు. తమ కస్టమర్ల కోసం క్రెడిట్ షెల్స్ తెచ్చామన్నారు.

వాటిని చెల్లిస్తాం
ఏదేమయినప్పటికీ కార్యకలాపాల పునఃప్రారంభమైనందున, అలాగే విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, క్రెడిట్ షెల్ మొత్తాన్ని త్వరితగతిన చెల్లించడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యత అని రోనోదత్తా అన్నారు. జనవరి 31, 2021 నాటికి వంద శాతం క్రెడిట్ షెల్ చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుండి విమాన కార్యకలాపాలు 100 శాతానికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ కార్యకలాపాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.

కరోనా.. లాక్ డౌన్
కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 25వ తేదీన దేశీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 నుండి అంతర్జాతీయ విమానాలు నిలిపివేశారు. మే నెల నుండి వందే భారత్ మిషన్, కింద, జూలై నుండి ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు విమానసంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications