IndiGo Airlines Success Story: విమానాల రద్దు కారణంగా గత రెండు రోజుల నుంచి ఇండిగో వార్తల్లో నిలిచింది. అయితే మీకు తెలుసా భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన విమానయాన సంస్థ ఇండిగోనే. విమానయాన మార్కెట్లో సుమారు 60 శాతం ఇండిగోనే కలిగి ఉంది. ఎయిర్ లైన్స్ లో తిరుగులేని ఆధిపత్యం సాధిస్తున్న ఇండిగో సంస్థ ప్రయాణం ఇద్దరు ఫ్రెండ్స్ తో మొదలైంది.

ప్రస్తుతం ఇండియన్ ఏవియేషన్ మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటాను ఇండిగో నియంత్రిస్తోంది. అంటే.. ప్రతి 10 మంది ప్రయాణికులలో ఆరుగురు ఇండిగో విమానంలోనే ప్రయాణిస్తున్నారు. రోజుకు ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా విమానాలను నడిపే ఇండిగో.. కేవలం ఒకే ఒక అద్దె విమానంతో తన జర్నీని మొదలుపెట్టింది. అలా మొదలై.. ఈ రోజు దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇద్దరు స్నేహితుల కల..
ఇండిగోను ఇద్దరు స్నేహితులు.. రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్.. 2005లో స్థాపించారు. ఆ సమయంలో జెట్ ఎయిర్‌వేస్ భారత విమానయాన మార్కెట్‌ను శాసిస్తోంది. ఎయిర్ ఇండియా, కింగ్‌ఫిషర్ వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ఇండీగో అనతికాలంలోనే 'కింగ్ ఆఫ్ ఎయిర్‌లైన్స్'అనే పేరును సంపాదించుకుంది.
- 'ఇండిగో' పేరు వెనుక కథ: ఈ ఎయిర్‌లైన్‌కు "IndiGo" అనే పేరు పెట్టడం వెనుక ఉన్న భావన "India on the Go", అంటే.. "భారత్ వేగంగా దూసుకుపోతోంది" అనే అర్థం నుంచి వచ్చింది.
- ఒకే ఒక్క విమానంతో ఆరంభం: రాకేష్, రాహుల్.. సంస్థను ప్రారంభించినప్పుడు వారి వద్ద ఉన్నది కేవలం ఒకే ఒక అద్దె విమానం.
ఇండిగో సీక్రెట్ ట్రిక్
అప్పట్లో భారతీయ విమానయాన సంస్థలన్నీ బోయింగ్ విమానాలనే ఉపయోగిస్తుండగా.. ఇండిగో ఏకంగా ఎయిర్‌బస్ నుంచి 100 విమానాలను కొనుగోలు చేస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఇదే సరైన అవకాశంగా భావించిన ఎయిర్‌బస్.. ఇండిగోకు 40-50 శాతం భారీ తగ్గింపుతో విమానాలను విక్రయించింది.
రాహుల్, రాకేష్ లు ఈ 100 ఎయిర్‌బస్ A320 విమానాలను సగం ధరకే కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటన్నిటినీ లాభానికి అమ్మేశారు. ఈ లావాదేవీ ద్వారా ఇండిగో దాదాపు రూ.200 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ డబ్బును ఉపయోగించి, ఇండిగో విమానాలను లీజుకు తీసుకొని దేశంలోని ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది.
ఇండిగో సక్సెస్ స్ట్రాటజీ..
ఇండిగో విజయం వెనుక ఉన్న రహస్యం 'అందుబాటు ధరలో విమాన ప్రయాణం' (Affordable Air Travel) అనే భావనను అమలు చేయడమే. ఖరీదైన సౌకర్యాల కంటే.. తక్కువ ధరలో, నమ్మకమైన సేవపై దృష్టి సారించింది. ఈ తక్కువ-ధర విధానం మధ్యతరగతి ప్రజలకు చేరువై.. దేశంలో అత్యధిక మంది ప్రయాణికులు ఇష్టపడే ఎయిర్‌లైన్‌గా దీన్ని మార్చింది.
ఇండిగో విస్తరణ రికార్డులు..
- 2012: 500 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించి, దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా అవతరించింది.
- 2023: ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్ అయిన 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
- 2023: 100 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందించిన తొలి భారతీయ ఎయిర్‌లైన్‌గా రికార్డు సృష్టించింది.
- భారత విమానయాన మార్కెట్‌లో 64.2% వాటాను సాధించింది.
ప్రస్తుతానికి.. ఇండిగో భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ అలాగే ఆసియాలో రెండవ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా కొనసాగుతోంది. అయితే దురదృష్టవశాత్తూ సాంకేతిక లోపాల కారణంగా విమానాలు రద్దు చేసి వార్తల్లోకి ఎక్కింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications