Indigo: దేశీయ విమానయాన రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగిన విధంగా ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్స్ మరియు రూట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఓ రికార్డు క్రియేట్ చేసింది. భారత విమానయాన రంగంలో చరిత్ర సృష్టించింది.
రోజుకు 2 వేలకు పైగా ప్రణాళికాబద్ధమై విమానాలను నడిపి ఇండిగో కొత్త మైలురాయిని నెలకొల్పింది. తద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఎయిర్‌లైన్‌గా నిలిచింది. అక్టోబర్ 2023కి సంబంధించిన OAG డేటా ప్రకారం.. ఫ్రీక్వెన్సీ మరియు సీట్ కెపాసిటీ రెండింటిలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో చోటు దక్కించుకుంది.

'ఇండిగో ఇప్పుడు 2 వేలకు పైగా రోజువారీ షెడ్యూల్డ్ విమానాలను కలిగి ఉంది. ఇందులో కార్గో ఆపరేషన్స్, CAPF & ఆర్మీ చార్టర్లు కూడా ఉన్నాయి. 2006లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి కేవలం 17 ఏళ్లలోనే ఎయిర్‌లైన్ ఈ ఫీట్ సాధించింది. ఆపరేషనల్ సామర్థ్యం, విశ్వసనీయత, కస్టమర్ ఓరియంటేషన్ లో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది' అని ఎయిర్‌లైన్ CEO పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.
ఈ ఘతన కేవలం సంఖ్యాపరమైన ఫీట్ మాత్రమే కాదన్నారు. కనెక్టివిటీతో పాటు ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు తమకు అవకాశం కల్పించే వ్యూహాత్మక ఘనతగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలను, వారి ఆకాంక్షలను అనుసంధానించాలనే తమ మిషన్ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications