Cyclone Michaung: మిచాంగ్ తుపాను తాకడంతో నిన్న భారీ వర్షం తమిళనాడు రాజధాని నగరం అతలా కులతమైంది. దీంతో ప్రజా జీవితం, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్థంభించాయి.
ఈ తరుణంలో ఇప్పటికే చెన్నై నగరం నుంచి ప్రయాణించాల్సిన దాదాపు 1000కి పైగా విమాన సేవలు రద్దయ్యాయి. ఆ ప్రాంతంలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా విమానాశ్రయం మూసివేయబడిన తర్వాత ఇండిగో ఎయిర్‌లైన్స్ దేశం అంతటా 550 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో విస్తారా 10, ఎయిర్ ఇండియా 10 విమానాలను చెన్నై నుంచి నిలిపివేశాయి. ప్రస్తుతం వర్షం తగ్గటంతో నగరంలో పునరుద్ధరణ చర్యలను అధికారులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

చెన్నై విమానాశ్రయంలోనికి వరదనీరు ప్రవేశించడంతో సోమవారం రన్‌వేను మూసివేయవలసి వచ్చింది. అయితే ఉదయం 9 నుంచి కార్యకలాపాలను మెుదలుపెట్టింది. ఇదే క్రమంలో తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడంతో విశాఖపట్నం విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. మధ్యాహ్నం చెన్నై నుంచి ఇండిగో తన విమానాలను తిరిగి ప్రారంభించినప్పటికీ.. నేడు సైతం దాదాపు 60 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.
ఇదే క్రమంలో టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు పెద్ద ఊరటను అందించే వార్త చెప్పింది. చెన్నైలో ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా మంగళవారం చెన్నై నుంచి బయలుదేరే ప్రయాణీకులకు రీషెడ్యూలింగ్/ టిక్కెట్ల రద్దుకు సంబంధించిన ఛార్జీల వన్-టైమ్ మాఫీని డిసెంబర్ 5, 2023 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరింత సమాచారం కోసం ప్రయాణీకులు 24×7 కస్టమర్ కాంటాక్ట్ టీమ్‌ను సంప్రదించేందుకు 0124 264 1407, 020-26231407, 1860 233 1407 నంబర్లను అందుబాటులో ఉంచింది.


Click it and Unblock the Notifications