ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 3) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్‌లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, నేడు ఓ సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పటికీ, నష్టాల్లోనే ఉంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా ఉన్నాయి.
కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మార్కెట్లకు ఆందోళన కలిగించాయి. ఇప్పటికే విధించిన లాక్ డౌన్, ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, దీంతో రికవరీ ఆలస్యమయ్యే అవకాశముందని వార్తలు కలవరపెట్టాయి.

భారీ నష్టాల్లో..
సెన్సెక్స్ నేడు 48,356.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,613.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 48,028.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 299.04 (0.61%) పాయింట్లు నష్టపోయి 48,483.32 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,584.35 వద్ద గరిష్టాన్ని, 14,416.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గం.11.30 సమయానికి 70.60 (0.48%) పాయింట్లు క్షీణించి 14,560.70 పాయింట్ల ట్రేడ్ అయింది.14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,584.35 వద్ద గరిష్టాన్ని, 14,416.25 కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో SBI లైఫ్ ఇన్సురెన్స్ 3.05 శాతం, మారుతీ సుజుకీ 2.06 శాతం, అదానీ పోర్ట్స్ 1.98 శాతం, HUL 1.92 శాతం, హిండాల్కో 1.28 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 3.88 శాతం, రిలయన్స్ 2.12 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.73 శాతం, ONGC 1.62 శాతం, ICICI బ్యాంకు 1.31 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.63 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.86 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.11 శాతం, నిఫ్టీ మెటల్ 0.92 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 1.43 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.72 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.01 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 1.41 శాతం, నిఫ్టీ ఫార్మా 0.08 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.17 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.08 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.54 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications