బ్యాంకింగ్, నిఫ్టీలో అమ్మకాల వెల్లువ, రికార్డుల తర్వాత నష్టాల్లోకి మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 12) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారీగా ఎగిసి, రికార్డు స్థాయిలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు నేడు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లు ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన తర్వాత మార్కెట్లపై ప్రభావం ఉండవచ్చు.
ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 146.32 పాయింట్లు (0.34%) నష్టపోయి 43,447.35 వద్ద, నిఫ్టీ 34.50 పాయింట్లు(0.27%) నష్టపోయి 12,714.70 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు నష్టపోయింది. ఓ సమయంలో 300 పాయింట్లు కూడా నష్టపోయింది. డాలర్ మారకంతో దేశీయ కరెన్సీ రూపాయి 74.44 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 74.37 వద్ద ముగిసింది.

బ్యాంకింగ్, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ ఫార్మా 1 శాతం మేర ఎగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 2.50 శాతం, సన్ ఫార్మా 1.67 శాతం, టైటాన్ కంపెనీ 1.18 శాతం, గ్రాసీమ్ 1.15 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.98 శాతం లాభాల్లో ఉన్నాయి.టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 2.30 శాతం, ఎస్బీఐ 2.11 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.92 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.83 శాతం, ఓఎన్జీసీ 1.87 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రంగాలవారీగాచూస్తే నిఫ్టీ ఆటో 0.18 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.48 శాతం, నిఫ్టీ మీడియా 0.45 శాతం, నిఫ్టీ ఫార్మా 1.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.78 శాతం లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ బ్యాంకు 1.58 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.03 శాతం, నిఫ్టీ మెటల్ 0.62 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.65 శాతం నష్టాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications