వారంతంలో ప్రాఫిట్ బుకింగ్, భారీ నష్టాల్లో మార్కెట్లు: HDFC ట్విన్స్ పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 30) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 14,800 వద్ద ట్రేడ్ అవుతోంది. HDFC బ్యాంకు, HDFC రెండూ కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు సూచీలు లాభాల్లో కొనసాగడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.
అలాగే, కరోనా సెకండ్ వేవ్ భయాలు, రేపటి నుండి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది. చైనాలో ఏప్రిల్ నెల తయారీ కార్యకలాపాలు నెమ్మదించాయనే వార్తలు ఆసియా మార్కెట్ల కరెక్షన్‌కు కారణమయ్యాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన పడింది.

సెన్సెక్స్ 400 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 49,360.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,569.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,229.51 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 49,765.94 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 425.95 (0.86%) క్షీణించి 49,339 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,747.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,855.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,730.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం సమయానికి 108.60 (0.73%) పాయింట్లు నష్టపోయి 14,786 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ 6.34 శాతం, కోల్ ఇండియా 3.90 శాతం, ఐవోసీ 3.99 శాతం, బీపీసీఎల్ 3.16 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.02 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 3.67 శాతం, HDFC 3.30 శాతం, HUL 2.30 శాతం, ICICI బ్యాంకు 2.12 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.89 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో JSW స్టీల్, టాటా స్టీల్, HDFC బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 0.80 శాతం నష్టపోగా, మిడ్ క్యాప్ 0.28 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.52 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.71 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.54 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.99 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఎనర్జీ 1.55 శాతం, నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ మీడియా 0.29 శాతం, నిఫ్టీ మెటల్ 0.14 శాతం, నిఫ్టీ ఫార్మా 0.83 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.39 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications