For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధ్యాహ్నం ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

|

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 4, 2022) ఫ్లాట్‌గా ప్రారంభమై, ఆ తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్లాయి. గతవారం 57,000 పాయింట్ల దిగువన ముగిసిన సెన్సెక్స్, నేడు మరింత క్షీణించి 56,500 పాయింట్ల దిగువకు కూడా పడిపోయింది. అమెరికా మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ఎట్టకేలకు చివరకు లాభాల్లో ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం అగ్రరాజ్యం మార్కెట్ పైన ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.

ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఉదయం 57,124.91 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,184.21 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,398.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.15 సమయానికి సెన్సెక్స్ 563 పాయింట్లు క్షీణించి 56,412 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 16,910 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 76.40 వద్ద ట్రేడ్ అయింది.

Indices trade lower, Nifty below 17,000 ahead of RBI Governor statement

మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, HDFC బ్యాంకు, బ్రిటానియా, HDFC ఉన్నాయి.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు మధ్యాహ్నం గం.2కు ఓ ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ నష్టాల్లోకి వెళ్లాయి. ద్రవ్యోల్భణం భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్ ప్రకటన అందరిని ఉత్కంఠకు గురి చేస్తోంది.

English summary

మధ్యాహ్నం ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు | Indices trade lower, Nifty below 17,000 ahead of RBI Governor statement

Indices trade lower, Nifty below 17,000 ahead of RBI Governor statement at 2pm.
Story first published: Wednesday, May 4, 2022, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X