ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 16) నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఎఫ్ంసీజీ కొనుగోళ్ల ఒత్తిడిని ఎదుర్కోగా, మెటల్, పవర్ సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ 1 శాతం నుండి 5 శాతం మేర క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు కొరవడటంతో ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదులుతున్నాయి. మరోవైపు నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

నష్టాల్లో మార్కెట్
సెన్సెక్స్ ఉదయం 52,782.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,816.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,498.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,847.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,880.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,768.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి 215.71 (0.41%) పాయింట్లు నష్టపోయి 52,561.64 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 75.90 (0.48%) పాయింట్లు నష్టపోయి 15,792.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

గెయినర్స్, లూజర్స్
సెన్సెక్స్ 30 సూచీలో ONGC, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, HUL, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మ, కొటాక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా స్టాక్స్ లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, HDFC షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.47 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.77 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.32 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.38 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.65 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.30 శాతం, నిఫ్టీ ఐటీ 0.17 శాతం, నిఫ్టీ మీడియా 0.79 శాతం, నిఫ్టీ మెటల్ 1.82 శాతం, నిఫ్టీ ఫార్మా 0.31 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.76 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.39 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.31 శాతం లాభపడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications