భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: దెబ్బతీసిన బ్యాంకు, మెటల్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూలై 29) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రెస్ మీట్ ఉందనే వార్తల అనంతరం నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 52,735.59 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 15,814.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు కూడా నష్టాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ఉంది.

నష్టాల్లో మార్కెట్లు
బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు నేడు స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి. మెటల్, బ్యాంకింగ్, ఆటో సహా వివిధ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మధ్యాహ్నం గం.11.20 సమయానికి సెన్సెక్స్ 134.90 (0.26%) పాయింట్లు నష్టపోయి 52,600 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 46.00 (0.29%) పాయింట్లు నష్టపోయి 15,768 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,795.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,816.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,533.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,807.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,835.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,747.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 1.29 శాతం, సిప్లా 1.09 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.72 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.66 శాతం, రిలయన్స్ 0.59 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 1.92 శాతం, హిండాల్కో 1.63 శాతం, కొటక్ మహీంద్రా 1.45 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.44 శాతం, మారుతీ సుజుకీ 1.31 శాతం నష్టపోయాయి.
మధ్యాహ్నం సమయానికి నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC లైఫ్, కొటక్ మహీంద్రా, రిలయన్స్, టాటా స్టీల్, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.23 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.11 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.13 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.23 శాతం, నిఫ్టీ ఫార్మా 0.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.27 శాతం, లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.66 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.27 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ మెటల్ 0.84 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.72 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications