స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 25, 2022 మంగళవారం) కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఓ సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయినప్పటికీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 57,158.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,626.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,409.63 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,001.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,201.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,836.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

వెయ్యి పాయింట్లకు పైగా పతనమై...
నేడు ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం వెయ్యి పాయింట్లకు పైగా పతనమై 56,500 పాయింట్ల దిగువకు కూడా పడిపోయింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లు. ఈ గరిష్టంతో దాదాపు ఏడువేలు పతనమైంది. అయితే తిరిగి కోలుకొని, 57,000 పైన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా ఓ సమయంలో 16,900 పాయింట్ల దిగువకు పడిపోయి, అనంతరం 17,140 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 57,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8.50 పాయింట్లు క్షీణించి 17,140 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది

టాప్ గెయినర్స్, లూజర్స్
బ్యాంకింగ్, పవర్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 0.5 శాతం వరకు నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు, యూపీఎల్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, విప్రో, టైటాన్ కంపెనీ, రిలయన్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.

వీఐఎక్స్
మార్కెట్ ఒడిదుడుకులను సూచించే వొలాటాలిటీ ఇండెక్స్ (VIX) 22.62 శాతానికి చేరుకుంది. సాధారణంగా వీఐఎక్స్ పెరుగుదల ఇన్వెస్టర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాలను సూచిస్తుంది. రాబోయే నెల రోజుల్లో మార్కెట్ కదలికలపై ఓ అంచనా అందిస్తుంది. వీఐఎక్స్ పదిహేను శాతానికి పైగా ఉంటే రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్లో భారీ ఊగిసలాట కొనసాగే అవకాశముంది. మార్కెట్ కదలికలపై ఇన్వెస్టర్ల భయాలను తెలియజేస్తుంది. రిలయన్స్ షేర్లు నేడు 1.5 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications