ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 2) ఫ్లాట్‌గా ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 44,430 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 13,057 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
మెటల్ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. గెయిల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నిన్న మార్కెట్లు 500 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి 73.45 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మంగళవారం నాటి సెషన్లో 73.66 వద్ద క్లోజ్ అయింది.

ప్రాఫిట్ బుకింగ్
అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ నిన్న మన మార్కెట్లు భారీగా భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే సంకేతాలు ఉదయం కనిపించాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. నిఫ్టీ 50 స్టాక్స్ 0.33 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.58 శాతం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.78 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.64 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ మీడియా 0.14 శాతం, నిఫ్టీ మెటల్ 2.74 శాతం, నిఫ్టీ ఫార్మా 0.10 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.21 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.67 శాతం లాభాల్లో ఉన్నాయి.
నిఫ్టీ బ్యాంకు 0.71 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.87 శాతం, నిఫ్టీ ఐటీ 0.56 శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్.. లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 6.19 శాతం, టాటా స్టీల్ 3.50 శాతం,JSW స్టీల్ 3.32 శాతం, ఐవోసీ 3.20 శాతం, అదానీ పోర్ట్స్ 2.75 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 1.69 శాతం, HDFC బ్యాంకు 1.52, HDFC 1.41 శాతం, కొటక్ మహీంద్రా 1.37 శాతం, ఇన్ఫోసిస్ 1.31 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ ఈ రోజు మరింత క్షీణించింది. స్టాక్ 0.53 శాతం పడిపోయి రూ.1944 వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ రూ.1950 దిగువకు చేరుకుంది.

టాటా మోటార్స్ జంప్
టాటా మోటార్స్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 21 శాతం లాభడ్డాయి. దీంతో ఈ స్టాక్స్ నేడు 3 శాతం మేర లాభపడ్డాయి. గత ఏడాది నవంబర్ నెలలో 41,124 యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్, ఈ ఏడాది ఇదే కాలంలో 49,650 యూనిట్లు విక్రయించింది. డొమెస్టిక్ సేల్స్ 26 శాతం పెరిగి 47,859కి చేరుకున్నాయి.
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా ఐసీఐసీఐ స్టాక్స్ నష్టపోయాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications