ముంబై: వరుసగా రెండు రోజు పాటు భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం) నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్ వందకు పైగా పాయింట్ల నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ సెన్సెక్స్ 50,000 పాయింట్లకు పైనే కదలాడుతోంది. నిఫ్టీ కూడా క్షీణించినప్పటికీ 15,000 పాయింట్లకు పైనే ఉంది. వరుసగా రెండు రోజుల పాటు భారీ లాభాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. డాలర్ మారకంతో రూపాయి రూ.73.04 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా మార్కెట్లు బుధవారం బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ముగిశాయి.

స్వల్ప నష్టాల్లో..
సెన్సెక్స్ 50,088.81 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,279.01 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,015.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 110.45 (0.22%) పాయింట్లు ఎగిసి 50,078 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 15,058.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,133.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,049.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11 సమయానికి 28.55 (0.19%) పాయింట్లు నష్టపోయి 15,080 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 3.06 శాతం, శ్రీసిమెంట్స్ 2.32 శాతం, నెస్ట్లే 1.43 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.16 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.14 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.08 శాతం, ఓఎన్జీసీ 1.98 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.81 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.63 శాతం, HDFC బ్యాంకు 1.06 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, యూపీఎల్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
ఇక, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ 1.62 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.82 శాతం నష్టాల్లో ఉండగా, హాంగ్‌షెంగ్ 1.42 శాతం లాభపడింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.18 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.09 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.31 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.23 శాతం, నిఫ్టీ ఐటీ 0.76 శాతం, నిఫ్టీ ఫార్మా 0.96 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.66 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.62 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, నిఫ్టీ మీడియా 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.15 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.79 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications