ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 28) లాభాల్లో ప్రారంభమై, అంతలోనే నష్టాల్లోకి వెళ్లాయి. గతవారం 30 షేర్ సెన్సెక్స్ 580 పాయింట్లు లేదా 1.10 శాతం లాభపడి ముగిసింది. నేడు మాత్రం ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం గం.3కు మీడియా ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి ఏం చెబుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటోన్న విషయం తెలిసిందే.

లాభాల నుండి నష్టాల్లోకి
సెన్సెక్స్ నేడు ఉదయం 53,126.73 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,126.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 52,728.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు మరోసారి 53 వేల పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. క్రితం సెషన్‌లో 75 పాయింట్ల దూరంలో నిలిచిన సెన్సెక్స్, ఇప్పుడు ఆ మార్కును దాటింది. కానీ అంతలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లింది. నిఫ్టీ 15,915.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,915.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,812.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ 102.96 (0.19%) పాయింట్లు క్షీణించి 52,822.08 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23.35 (0.15%) పాయింట్లు తగ్గి 15,837 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం సమయం వరకు నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 1.93 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.78 శాతం, ఓఎన్జీసీ 1.74 శాతం, అదానీ పోర్ట్స్ 1.66 శాతం, టాటా స్టీల్ 1.61 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 2.80 శాతం, టైటాన్ కంపెనీ 1.25 శాతం, టీసీఎస్ 0.98 శాతం, శ్రీ సిమెంట్స్ 0.97 శాతం, HCL టెక్ 0.82 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ50 స్టాక్స్ 0.14 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.58 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.05 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.08 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.20 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.26 శాతం, నిఫ్టీ ఐటీ 0.52 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.05 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.16 శాతం, నిఫ్టీ మెటల్ 1.41 శాతం, నిఫ్టీ ఫార్మా 1.43 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.86 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.25 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications