ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(జనవరి 25) భారీ లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. అతిపెద్ద వెయిటేజీ కలిగిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం భారీగా నష్టపోయింది. రిలయన్స్ నేడు దాదాపు 4.5 శాతం లేదా రూ.92 మేర క్షీణించి రూ.2,050 నుండి రూ.1958కి పడిపోయింది. బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 2 శాతం మేర పడిపోయింది. నిఫ్టీ 14,400 పైకి చేరింది. బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలను పైకి లేపాయి. సెన్సెక్స్ చివరి సెషన్లో 746.22 పాయింట్లు లేదా 1.50% నష్టపోయి 48,878.54 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 218.50 పాయింట్లు లేదా 1.50% పడిపోయి 14,371.90 పాయింట్ల వద్ద ముగిసింది.

750 పాయింట్లు అప్ అండ్ డౌన్
డాలర్ మారకంతో రూపాయి ఫ్లాట్‌గా 72.95 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 72.97 వద్ద క్లోజ్ అయింది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 262.71 పాయింట్లు లేదా 0.54% లాభంతో 49,141.25 పాయింట్ల వద్ద, నిఫ్టీ 98.10 పాయింట్లు లేదా 0.68% ఎగిసి 14,470 పాయింట్ల వద్ద ఉంది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 48,878 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నేడు ప్రారంభంలోనే 350 పాయింట్లకు పైగా లాభంతో 49,253 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 49,263 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 48,512 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 750 పాయింట్ల మేర కదలాడింది. 1088 షేర్లు లాభాల్లో, 260 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 61 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

టాప్ లూజర్ రిలయన్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 7.85 శాతం, UPL 4.07 శాతం,సిప్లా 3.33 శాతం, యాక్సీస్ బ్యాంకు 2.92 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.06 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 4.44 శాతం, ఐచర్ మోటార్స్ 3.15 శాతం, టాటా మోటార్స్ 2.63 శాతం, ONGC 2.53 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.61 శాతం నష్టపోయాయి.
రిలయన్స్ మధ్యాహ్నం గం.12 సమయానికి 4.42 శాతం క్షీణించి రూ.1959కి పడిపోయింది.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.06 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.44 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.68 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.31 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.31 శాతం, నిఫ్టీ ఐటీ 0.69 శాతం, నిఫ్టీ మీడియా 0.68 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.59 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.86 శాతం, నిఫ్టీ మెటల్ 0.09 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.07 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.02 శాతం, నిఫ్టీ ఫార్మా 1.05 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.23 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications