స్టాక్ మార్కెట్ జంప్, సెన్సెక్స్ 52,000 దిశగా: రిలయన్స్ మళ్లీ డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 12) లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత 200 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయింది. ఉదయం గం.9.15 సమయానికి సెన్సెక్స్ 37.13 పాయింట్లు లాభపడి 51,568 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు ఎగిసి 15,185 పాయింట్ల వద్ద ఉంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు భారీగా కనిపించాయి. మిడ్ క్యాస్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. అయితే ప్రారంభంలో ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, మెటల్ స్టాక్స్ కిందకు లాగాయి. సెన్సెక్స్ 52,000 దిశగా దూసుకెళ్తోంది.

సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో..
సెన్సెక్స్ నేడు 51,615 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,804 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,492 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం నుండి సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. నిన్నటి క్లోజింగ్‌తో ఓ సమయంలో 250 పాయింట్లకు పైగా లాభపడింది. ఓ సమయంలో స్వల్ప నష్టాల్లోకి వెళ్లినప్పటికీ వెంటనే కోలుకుంది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 15,214 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.49 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 3.40 శాతం, ICICI బ్యాంకు 2.60 శాతం, SBI 2.02 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.70 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 3.82 శాతం, కోల్ ఇండియా 2.30 శాతం, సన్ ఫార్మా 2.21 శాతం, ఓఎన్జీసీ 1.96 శాతం, ఎన్టీపీసీ 1.85 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
నిన్న భారీగా లాభపడిన రిలయన్స్ నేడు స్వల్పంగా 0.65 శాతం నష్టపోయి రూ.2,042 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.31 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.04 శాతం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.07 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.43 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.20 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.43 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.87 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.21 శాతం,
నిఫ్టీ మెటల్ 1.25 శాతం, నిఫ్టీ ఫార్మా 0.87 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications