లాభాల్లో స్టాక్ మార్కెట్లు: మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా...
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఏ సమయంలోను నష్టపోనప్పటికీ, ఆరంభ లాభాలతో పోలిస్తే మధ్యాహ్నం సమయానికి కాస్త తగ్గాయి. ఇటీవల చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రష్యా డిమాండ్లను తాము సీరియస్‌గా పరిశీలిస్తున్నామని, తక్షణమే యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల శాంతి చర్చల్లో పురోగతి కనిపించే అవకాశముందని అంటున్నారు. అయితే చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే ప్రతికూల ప్రభావం తప్పదనే ఆందోళన కనిపిస్తోంది.
సెన్సెక్స్ నేడు ఉదయం 57,514 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,934 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,644 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,297 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,322 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,241 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.15 సమయానికి 131 పాయింట్లు లాభపడి 57,745 పాయింట్ల వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి 17,263 పాయింట్ల వద్ద కదలాడింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.75.95 వద్ద ట్రేడ్ అయింది.

అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. రియాల్టీ, ఫార్మా, ఆటో సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. కేవలం మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఐచర్ మోటార్స్, HDFC ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హిండాల్కో ఉన్నాయి.


Click it and Unblock the Notifications