ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 16, మంగళవారం) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 52,000 పాయింట్ల పైన ముగిసింది. నిఫ్టీ 15,300 పాయింట్ల పైన స్థిరపడింది. నిన్న ఒక్కరోజే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగి, రూ.205.15 లక్షల కోట్లకు చేరుకుంది. నేడు కూడా అదే దూకుడు కొనసాగుతోంది.
కొద్ది కాలంలోనే సూచీలు జంప్ చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 4న 48,000 తాకిన సెన్సెక్స్, జనవరి 11న 49,000ను, జనవరి 21న 50,000 మార్కును తాకింది. అయితే బడ్జెట్‌కు వారం ముందు సూచీలు పడిపోయి 46000 స్థాయికి దిగజారాయి. బడ్జెట్ అనంతరం తిరిగి పుంజుకోవడంతో రెండు వారాల్లోనే 52వేల మార్కును అందుకుంది. ఫిబ్రవరి 5న సెన్సెక్స్ 51,000 మార్కును, ఫిబ్రవరి 15న 52,000 మార్కును తాకింది.

భారీ లాభాల నుండి...
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.4 శాతం లాభాల్లో ఉంది. రియాల్టీ, ప్రభుత్వరంగ, ఆయిల్ & గ్యాస్, ఇన్ఫ్రా రంగ షేర్లు దూసుకెళ్తున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ నిన్న 52,154 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నేడు దాదాపు 250 పాయింట్లు లాభపడి 52,400 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 52,516 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,285 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,371.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,431.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,365.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంతో ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 4.82 శాతం, టాటా స్టీల్ 4.25 శాతం, హిండాల్కో 4.22 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.97 శాతం, JSW స్టీల్ 2.80 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 1.57 శాతం, ICICI బ్యాంకు 1.51 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.44 శాతం, హీరోమోటో కార్ప్ 0.73 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.69 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు లాభపడుతున్నాయి. FII పెట్టుబడుల భారీగా రావడం, రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. నిఫ్టీ 50 స్టాక్స్ 0.32 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.21 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.07 శాతం, నిఫ్టీ మీడియా 0.22 శాతం, నిఫ్టీ మెటల్ 3.23 శాతం, నిఫ్టీ ఫార్మా 0.20 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.51 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.59 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.28 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.32 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.15 శాతం, నిఫ్టీ ఐటీ 0.76 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.37 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications