ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 3) భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 52వేల పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ ఓ సమయంలో 15,700 పాయింట్ల సమీపానికి చేరుకుంది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయ వ్యాల్యూ 24 పైసలు క్షీణించి రూ.72.68 వద్ద ట్రేడ్ అయింది. రియాల్టీ ఇండెక్స్ 4 శాతం ఎగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున పెరిగాయి.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 52,121.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,240.61 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,042.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11.30 సమయానికి 243.95 (0.48%) పాయింట్లు ఎగిసి 52,093.43 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,655.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,693.15 వద్ద గరిష్టాన్ని, 15,635.30 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.11.30 సమయానికి 80.15 (0.51%) పాయింట్లు ఎగిసి 15,653.90 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ONGC 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.83 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.19 శాతం, బజాజ్ ఆటో 0.94 శాతం, UPL 0.63 శాతం, ఎస్బీఐ 0.56 శాతం, HCL టెక్ 0.47 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, SBI ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.51 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.71 శాతం ఎగిసింది. నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.53 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.63 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 1.52 శాతం, నిఫ్టీ మెటల్ 1.61 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.56 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.01 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications