సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ: SBI 12 శాతం జంప్
ముంబై: కేంద్ర బడ్జెట్‌కు వరుసగా ఆరు రోజులు భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, బడ్జెట్ అనంతరం వరుసగా ఐదు రోజులు దూకుడు మీద ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొడుతున్నాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 265.86 పాయింట్లు లేదా 0.53% లాభపడి 50,880.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69.40 పాయింట్లు లేదా 0.47% ఎగిసి 14965.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 979 షేర్లు లాభాల్లో, 243 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 43 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండాటానికి తోడు ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.

51,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్, 15వేలు దాటిన నిఫ్టీ
క్రితం సెషన్లో సెన్సెక్స్ 50,614 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 51,031.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,073.27 పాయింట్ల వద్ద నేడు గరిష్టాన్ని తాకింది. 50,565.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు 51,000 పాయింట్లను క్రాస్ చేసిన సెన్సెక్స్ మధ్యాహ్నం గం.1 సమయానికి 273 పాయింట్ల లాభంతో 50,880 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటనకు ముందు 400 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ ఉదయం 15,000 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 14,963 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ స్టాక్స్‌లో SBI 11.24 శాతం, కొటక్ మహీంద్రా 4.07 శాతం, టాటా స్టీల్ 2.74 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.68 శాతం, ఐటీసీ 2.54 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 2.94 శాతం, టాటా మోటార్స్ 2.04 శాతం, ICICI బ్యాంకు 1.58 శాతం, యూపీఎల్ 1.47 శాతం, మారుతీ సుజుకీ 1.28 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, ఐటీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
SBI ఏకంగా దాదాపు 12 శాతం లాభపడింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.40 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.99 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.73 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.29 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.12 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.48 శాతం, నిఫ్టీ మెటల్ 0.68 శాతం, నిఫ్టీ ఫార్మా 1.39 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4.53 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.24 శాతం, లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.98 శాతం, నిఫ్టీ మీడియా 4.10 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.10 శాతం, నిఫ్టీ ఐటీ 0.85 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications