ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(డిసెంబర్ 16) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 8.10 పాయింట్లు(0.02%) లాభపడి 46,658.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.40 పాయింట్లు (0.00%) ఎగిసి 13,683.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 910 షేర్లు లాభాల్లో, 390 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 60 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 46,800ను (46,809 పాయింట్లు) దాటి సరికొత్త శిఖరానికి చేరుకుంది. తద్వారా 47,000 దిశగా సాగుతోంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 2.63 శాతం, HDFC 2.06 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.88 శాతం, శ్రీసిమెంట్స్ 1.68 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.27 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.23 శాతం, HUL 1.02 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.92 శాతం, బజాజ్ ఆటో 0.92 శాతం ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా చూస్తే...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.29 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.23 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.04 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.59 శాతం, నిఫ్టీ మీడియా 1.12 శాతం, నిఫ్టీ ఫార్మా 1.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.63 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.29 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.18 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.10 శాతం, నిఫ్టీ ఐటీ 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.26 శాతం, నష్టపోయాయి.

అమ్మకం, కొనుగోళ్లు..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ.1,982 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. దేశీ ఫండ్స్(DII) రూ. 1,718 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం FPIలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. DIIలు రూ.2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications