ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. గత రెండు సెషన్‌లలో సూచీలు వెయ్యి పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. నేడు (ఏప్రిల్ 28) ఆరంభం నుండి 400 పాయింట్లకు పైగా లాభాల్లోనే ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
దేశంలో కరోనా కట్టడికి కేంద్రం త్వరితగతిన చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలు మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. అలాగే, డబ్ల్యుహెచ్ఓ సహా అంతర్జాతీయంగా భారత్‌కు సహకారం లభిస్తుందనే అంశం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. కీలక రంగాల సూచీలు, దిగ్గజ కంపెనీలు రాణిస్తుండడంతో సూచీలు మంచి లాభాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ 49,066.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,416.92 వద్ద గరిష్టాన్ని, 49,066.64 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.11 సమయానికి సెన్సెక్స్ 487.57 (1.00%) పాయింట్లు ఎగిసి 49,418.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 48,944 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో దాదాపు 500 పాయింట్లు ఎగిసింది.
నిఫ్టీ 14,710.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,760.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,694.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.13 సమయానికి సెన్సెక్స్ 125.40 (0.86%) పాయింట్లు ఎగిసి 14,778.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 5.16 శాతం, ఐచర్ మోటార్స్ 4.74 శాతం, బజాజ్ ఆటో 3.93 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.81 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.45 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో JSW Steel స్టీల్ 2.05 శాతం, హిండాల్కో 1.75 శాతం, టాటా స్టీల్ 1.46 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.22 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 0.92 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.84 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.81 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 2.52 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.02 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.50 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.98 శాతం, నిఫ్టీ ఐటీ 0.02 శాతం, నిఫ్టీ మీడియా 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా 0.19 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.70 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.03 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ 1.23 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.17 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications