భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, మెటల్ స్టాక్స్ అదుర్స్: సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ఉన్నాయి. అమెరికా సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఈరోజు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కీలక రంగాల నుంచి మద్దతుతో సూచీలు పైపైకి కదులుతున్నాయి. అయితే, సెన్సెక్స్ నిఫ్టీ కదలికల్లో కరోనా అప్రమత్తత స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసుల విజృంభణ, ఆసియా మార్కెట్ల డీలా నేపథ్యంలో లాభాల్లో ఉన్నప్పటికీ, ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ 48,424.08 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,717.71 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,399.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 306.03 (0.63% పాయింట్లు ఎగిసి 48,692.49 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత 350 పాయింట్లు కూడా ఎగిసింది. నిఫ్టీ 14,493.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,583.75 గరిష్టాన్ని, 14,484.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి నిఫ్టీ 93.00 (0.64%) పాయింట్లు ఎగిసి 14,577.20 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 4.89 శాతం, అదానీ పోర్ట్స్ 2.63 శాతం, టాటా స్టీల్ 2.37 శాతం, లార్సన్ 1.87 శాతం, ఎస్బీఐ 1.70 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 2.99 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.56 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.33 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.04 శాతం, టెక్ మహీంద్రా 1.11 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, హిండాల్కో, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.64 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.96 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 0.53 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.07 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.38 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.23 శాతం, నిఫ్టీ ఐటీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 1.91 శాతం, నిఫ్టీ మెటల్ 2.16 శాతం, నిఫ్టీ ఫార్మా 0.13 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.82 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.64 శాతం లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications