సెన్సెక్స్ మరో రికార్డ్ దిశగా, నిఫ్టీ 14,000 పాయింట్లకు దగ్గరగా: ఈ స్టాక్స్ అదుర్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 29) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరోసారి సరికొత్త శిఖరాలకు చేరువగా దూసుకెళ్తోంది. రెండు వారాల క్రితం 47,000 మార్క్‌ను క్రాస్ చేసిన సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 47,700ను దాటింది. తద్వారా 48,000 మార్కును అందుకునే దిశగా సాగుతోంది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగిసి 47,626 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న కూడా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

47,700 దాటిన సెన్సెకస్
ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 225.30 పాయింట్లు(0.48%) లాభపడి 47,579.05 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65.80 పాయింట్లు(0.47%) ఎగిసి 13,939 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1073 షేర్లు లాభాల్లో, 240 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 44 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 6 పైసలు బలపడి 73.44 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.50 వద్ద క్లోజ్ అయింది. నిన్న స్వల్పంగా 4 పైసలు బలపడింది. సెన్సెక్స్ 47,700 పాయింట్లను దాటింది. నేడు నిఫ్టీ కూడా సరికొత్త శిఖరాన్ని తాకి, 14000 సమీపానికి చేరుకుంది. ఓ సమయంలో 13,965 పాయింట్లను దాటింది.

మళ్లీ 2000 దిగువకు రిలయన్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు 3.44 శాతం, HCL టెక్ 2.02 శాతం, HDFC 1.96 శాతం, టెక్ మహీంద్రా 1.63 శాతం, HDFC బ్యాంకు 1.51 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 1.88 శాతం, NTPC 1.79 శాతం, JSW స్టీల్ 1.60 శాతం, ONGC 1.17 శాతం, హిండాల్కో 1.33 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి
నిన్న 2003 వద్ద క్లోజ్ అయిన రిలయన్స్ షేర్ నేడు 0.70 శాతం పడిపోయి 1989 వద్ద ట్రేడ్ అయింది.
బజాజ్ ఆటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్లు దాటింది.

రంగాలవారీగా..
రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.52 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ మీడియా 1.44 శాతం, నిఫ్టీ మెటల్ 1.44 శాతం, నిఫ్టీ ఫార్మా 0.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.12 శాతం, నష్టపోయింది.
నిఫ్టీ బ్యాంకు 1.10 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.90 శాతం, నిఫ్టీ ఐటీ 0.74 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.65 శాతం, నిఫ్టీ ప్రయివేట్ బ్యాంకు 0.89 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications