ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(జూలై 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బీఎస్ఈ రియాల్టీ సూచీ 2 శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ +377.46 (0.72%) ఎగిసి 52,862.13 పాయింట్లు లాభపడింది.
52,682.89 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 52,871.29 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,604.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 96.65 (0.61%) పాయింట్లు లాభపడి 15,818.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,793.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,833.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,762.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 3.31 శాతం, టాటా స్టీల్ 1.81 శాతం, లార్సన్ 1.74 శాతం, HDFC బ్యాంకు 1.58, ఐచర్ మోటార్స్ 1.52 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 1.00 శాతం, టెక్ మహీంద్రా 0.95 శాతం, బీపీసీఎల్ 0.72 శాతం, అదానీ పోర్ట్స్ 0.55 శాతం, HCL టెక్ 0.55 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టీసీఎస్ ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 74.50 వద్ద ట్రేడ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా, నిఫ్టీ డిసెంబర్ నాటికి 17.400కు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ప్రయివేటు బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ ఏకంగా 2 శాతం కంటే పైన లాభపడ్డాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications