లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.19.13 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్లు గురువారం (28 ఏప్రిల్ 2022) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం స్వల్ప లాభాల్లో సూచీలు, అదే ఒరవడితో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఉదయం 57,296 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,296 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,961 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.53 సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు ఎగిసి 57,022 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 17,082 పాయింట్ల వద్ద కదలాడింది.
అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, బయోకాన్, ఎంఫాసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, వేదాంత కంపెనీలు మార్చి త్రైమాసికం ఫలితాలు వెల్లడించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ మంచి ఫలితాలు ప్రకటించింది. అలాగే చమురు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లోనే అప్రమత్తంగా కదులుతున్నాయి.

ఫార్మా, పవర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్లకు మద్దతు లభిస్తోంది. ఐటీ, మెటల్, రియాల్టీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర నేడు 1.70 శాతం లేదా రూ.47 లాభపడి రూ.2826 వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.13 లక్షల కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications