51,000 దాటిన సెన్సెక్స్: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 25) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ఓసమయంలో 420 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ మధ్యాహ్నం గం.12.20 సమయానికి 250 పాయింట్ల లాభంతో ఉంది. నిన్న బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఎగిశాయి. దీంతో సెన్సెక్స్ 1,030.28 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లు లాభపడింది. నేడు కూడా దాదాపు అదే ఒరవడి కొనసాగింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్ అదే ఒరవడి
నేడు సెన్సెక్స్ 51,207.61 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,386.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,035.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ 250 పాయింట్లలాభంతో 51,031 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ 15,079.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,170.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,065.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. గం.12.30 సమయానికి 105 పాయింట్లు లాభపడి 15,086 వద్ద ట్రేడ్ అయింది.

రిలయన్స్ అదుర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 5.71 శాతం, UPL 5.06 శాతం, ONGC 4.62 శాతం, BPCL 4.43 శాతం, హిండాల్కో 4.07 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ICICI బ్యాంకు 1.26 శాతం, టైటాన్ కంపెనీ 1.15 శాతం, నెస్ట్లే 1.14 శాతం, లార్సన్ 0.96 శాతం, HUL 0.77 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 1.52 శాతం లాభపడి రూ.2092 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.69 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.93 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.49 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.40 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.48 శాతం, నిఫ్టీ ఐటీ 0.50 శాతం,
నిఫ్టీ మీడియా 1.35 శాతం, నిఫ్టీ మెటల్ 3.17 శాతం, నిఫ్టీ ఫార్మా 1.41 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.27 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.33 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.20 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications