భారీ లాభాల్లో మార్కెట్లు: ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 16) లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుస పది రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. 10 రోజుల లాభాల్లో 40 శాతం నిన్న ఒక్కరోజే నష్టపోయాయి. ఉదయం గం.9.21 సమయానికి సెన్సెక్స్ 311.22 పాయింట్లు(0.78 శాతం) లాభపడి 40,039.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు (0.64 శాతం) ఎగిసి 11,755.40 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయింది.
ఐటీ సెక్టార్ ఒక శాతానికి పైగా లాభపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు అరశాతం లాభపడింది. బ్యాంకింగ్ సెక్టార్ 0.99 శాతం ఎగిసింది.

బ్యాంకింగ్, ఐటీ అదుర్స్
ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు తిరిగి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంధన్ బ్యాంకు 2 శాతానికి పైగా లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర, ఆర్బీఎల్, ఫెడరల్ బ్యాంకుల స్టాక్స్ 1 శాతం నుండి 2 శాతం మధ్య ఎగిశాయి. యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్బీఐ స్టాక్స్ 1 శాతం వరకు లాభపడ్డాయి. పీఎన్బీ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయింది.
ఐటీ స్టాక్స్‌లో కోఫోర్జ్ 2.56 శాతం, ఇన్ఫోసిస్ 1.58 శాతం, టెక్ మహీంద్ర 1.17 శాతం, విప్రో 0.73 శాతం, టీసీఎస్ 0.72 శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్ 2 శాతం, ఎల్టీఐ 2 శాతం, మైండ్ ట్రీ 8 శాతం క్షీణించింది.

ఫార్మా స్టాక్ టాప్
ఫార్మా స్టాక్స్ విషయానికి వస్తే బయోకాన్ 2.80 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.77 శాతం, కాడిలాక్ 2.63 శాతం, లుపిన్ 2.53 శాతం లాభపడ్డాయి. సిప్లా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టోరెంట్ ఫార్మా 1.59 శాతం నుండి 0.19 శాతం మేర లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఆల్కెమ్ నష్టాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో ఫార్మా స్టాక్స్ ఉన్నాయి.
దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలు మార్కెట్‌కు ఊపునిచ్చాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, నెస్ట్లే ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఉన్నాయి.

హాస్పిటాలిటీ అండ్ టూరిజం అప్
డాలర్ మారకంతో రూపాయి 73.32 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 73.38 వద్ద క్లోజ్ అయింది.
టూరిజం అండ్ హాస్పిటాలిటీ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. క్రమంగా రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో ఈ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. ఈ రంగానికి చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ స్టాక్స్ 3 శాతం, వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్ స్టాక్స్ 4 శాతం, మహీంద్రా హాలీడే రిసార్ట్స్ ఇండియా 0.95 శాతం, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ 0.38 శాతం, ఈఐహెచ్ 0.33 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications