ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సోమవారం భారీనష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు నేడు (మంగళవారం, ఏప్రిల్ 20) స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కరోనా కట్టడి దిశగా కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టడం మార్కెట్లకు ఉత్సాహం ఇచ్చింది. కరోనా కట్టడిలో కీలకంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే దిశగా కేంద్ర సోమవారం పలునిర్ణయాలు ప్రకటించింది.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ 48,473.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,478.34 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,209.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 333.34 (0.70%) పాయింట్లు ఎగిసి 48,282.76 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,526.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,526.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,439.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 105.75 (0.74%) పాయింట్లు ఎగిసి 14,462.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేడు ఉదయం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.70 శాతం, టాటా కన్స్ 4.23 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.16 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.85 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.61 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.10 శాతం, శ్రీసిమెంట్స్ 0.89 శాతం, HCL టెక్ 0.89 శాతం, HDFC 0.73 శాతం, టెక్ మహీంద్రా 0.69 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, HDFC, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.72 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.97 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.38 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.20 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.95 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 2.30 శాతం, నిఫ్టీ మెటల్ 1.13 శాతం, నిఫ్టీ ఫార్మా 1.15 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.05 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.20 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ మాత్రం 0.30 శాతం నష్టపోయింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications