ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 6) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమై కాసేపటికి క్షీణించినట్లు కనిపించినప్పటికీ తిరిగి పుంజుకుంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాలు నమోదు చేస్తున్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.27 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం దేశీయ సూచీలకు కలిసి వచ్చింది. అయితే కరోనా కేసులు దేశంలో పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ఈ వారం విడదల కానున్న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ నిన్న 49,159 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 49,441.13 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 49,558.77 వద్ద గరిష్టాన్ని, 48,936.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,737.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,757.75 వద్ద గరిష్టాన్ని, 14,573.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 248.73 (0.51%) పాయింట్లు లాభపడి 49,408 వద్ద, నిఫ్టీ 93.60 (0.64%) పాయింట్లు ఎగిసి 14,731 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు ఎగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 6.10 శాతం, ఏషియన్ పేయింట్స్ 3.42 శాతం, JSW స్టీల్ 2.99 శాతం, టాటా కన్స్యూమర్స్ 2.26 శాతం, టాటా మోటార్స్ 1.72 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో గ్రాసీమ్ 0.69 శాతం, టైటాన్ కంపెనీ 0.65 శాతం, బ్రిటానియా 0.17 శాతం, రిలయన్స్ 0.07 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.12 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.
HDFC, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు రాణించడం మార్కెట్లకు ఊతమిచ్చింది.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 0.67 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.08 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.82 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.43 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.59 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.66 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.91 శాతం, నిఫ్టీ ఐటీ 0.41 శాతం, నిఫ్టీ మెటల్ 1.77 శాతం, నిఫ్టీ ఫార్మా 1.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.12 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.26 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.69 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా 0.15 శాతం నష్టపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications