భారీ లాభాల నుండి కిందకు పడిపోయిన సెన్సెక్స్: రూ.2000 దాటిన రిలయన్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(ఫిబ్రవరి 11, గురువారం) ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత అతి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12.00 సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్ల లాభాల్లో మాత్రమే ఉంది. ప్రారంభంలో ఓ సమయంలో 210 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయింది. బడ్జెట్ అనంతరం సెన్సెక్స్ ఆరు సెషన్లలో 46 వేలస్థాయి నుండి 51వేల మార్కు క్రాస్ చేసింది. గత కొద్ది రోజులుగా రూ.2000 దిగువనే ట్రేడ్ అవుతున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మార్కు దాటి రూ.2,021 వద్ద ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ 200 నుండి 20 పాయింట్లకు
బడ్జెట్ అనంతరం సరికొత్త శిఖరాలను తాకిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మూడు రోజులుగా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ ఉదయం 51,165.84 ప్రారంభమై, 51,519.91 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,157.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం ఉదయం 200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.15 సమయానికి 20 పాయింట్ల లాభాల్లో ఉంది. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 15,125 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
మధ్యాహ్నం గం.12 సమయం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 3.29 శాతం, గెయిల్ 3.22 శాతం, రిలయన్స్ 2.36 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.78 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.45 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 3.12 శాతం, ఎన్టీపీసీ 2.60 శాతం, ఐచర్ మోటార్స్ 2.56 శాతం, లార్సన్ 1.48 శాతం, ఐటీసీ 0.81 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్, హిండాల్కో, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.15 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.26 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.06 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.81 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.45 శాతం, నిఫ్టీ ఐటీ 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.74 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.05 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.07 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.07 శాతం, నిఫ్టీ మీడియా 0.15 శాతం, నిఫ్టీ ఫార్మా 0.30 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.95 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.14 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications